నేడు, రేపు మోస్తరు వర్షాలు
ABN, Publish Date - Dec 25 , 2024 | 05:23 AM
రాష్ట్రంలో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కొనసాగుతోందని పేర్కొంది. రాగల 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. కాగా, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో మంగళవారం తెల్లవారుజామున 12.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 13 నుంచి 22 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.
Updated Date - Dec 25 , 2024 | 05:23 AM