RTC: రాష్ట్రంలో మరో రెండు కొత్త ఆర్టీసీ డిపోలు
ABN, Publish Date - Dec 05 , 2024 | 04:20 AM
తెలంగాణలో మరో రెండు కొత్త ఆర్టీసీ బస్ డిపోలను ఏర్పాటు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పది పదిహేనేళ్లుగా పలు కారణాలతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ కొత్త డిపోల ఏర్పాటుపై దృష్టి పెట్టలేకపోయిందన్నారు.
పెద్దపల్లి, ఏటూరునాగారంలో ఏర్పాటు: పొన్నం
హైదరాబాద్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మరో రెండు కొత్త ఆర్టీసీ బస్ డిపోలను ఏర్పాటు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పది పదిహేనేళ్లుగా పలు కారణాలతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ కొత్త డిపోల ఏర్పాటుపై దృష్టి పెట్టలేకపోయిందన్నారు. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే తీసుకున్న చర్యలతో ఆ సంస్థని లాభాల బాట పట్టించినట్టు వివరించారు.
దీంతో వెనుకబడిన ములుగు జిల్లా ఏటూరునాగారం, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్సు డిపోలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నూతన ఉద్యోగ నియామకాలు, కొత్త బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీలో సంస్కరణలు అమలుచేయడం వల్ల నష్టాల నుంచి లాభాల బాటకు తీసుకురాగలిగినట్టు వివరించారు. కొత్త డిపోల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు.
Updated Date - Dec 05 , 2024 | 04:20 AM