Protest: గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
ABN, Publish Date - Jul 02 , 2024 | 04:11 AM
నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి గాంధీ ఆస్పత్రిలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్‌కు మద్దతుగా విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాల నేతల రాకతో సోమవారం ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
దీక్ష చేస్తున్న మోతీలాల్‌కు మద్దతుగా విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష నేతల రాక
బీఆర్‌ఎస్ నేతలు పల్లా, రాకేశ్‌రెడ్డి అరెస్టు
అడ్డగుట్ట/తార్నాక, జూలై 1 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి గాంధీ ఆస్పత్రిలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్‌కు మద్దతుగా విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాల నేతల రాకతో సోమవారం ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-2 పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీ నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనే డిమాండ్లతో దీక్ష చేస్తున్న మోతీలాల్‌కు మద్దతు పలికేందుకు భారీగా విద్యార్థి నేతలు తరలివచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
అదే సమయంలో బీఆర్‌ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎనుగుల రాకేశ్‌రెడ్డి గాంధీకి రావడంతో మరింత గందరగోళం ఏర్పడింది. ఆస్పత్రిలోకి వెళ్లనివ్వాలంటూ పోలీసులతో పల్లా వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే కొందరు విద్యార్థి నేతలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో వారిపై పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేశారు. ఇటు పల్లాను అరెస్టు చేసి చాంద్రాయణగుట్ట పోలీ్‌సస్టేషన్‌కు, రాకేశ్‌రెడ్డిని బొల్లారం పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. మరికొందరు విద్యార్థి నేతలతో పాటు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారావుయాదవ్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఓయూలో ర్యాలీ.. అరెస్టులు
మోతీలాల్ నాయక్‌కు మద్దతుగా నిరుద్యోగులు, విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన లైబ్రరీ నుంచి గాంధీ ఆస్పత్రి వరకు భారీ ర్యాలీ తలపెట్టగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆర్ట్స్ కాలేజీ వద్ద ఓయూ పోలీసులు వారిని అరెస్టు చేసి బొల్లారం పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.
Updated Date - Jul 02 , 2024 | 04:11 AM