ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Employee Tension: నాగార్జునసాగర్‌లో.. టీజీ ఉద్యోగిని అడ్డుకున్న ఏపీ అధికారి

ABN, Publish Date - Nov 10 , 2024 | 03:02 AM

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ వద్ద శనివారం మరోసారి ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. సాగర్‌ ప్రాజెక్టు(తెలంగాణ) జేఈ కృష్ణయ్య కథనం ప్రకారం.. కుడికాల్వ వద్ద నీటి నిల్వల రీడింగ్‌ తీసుకునేందుకు వర్క్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వీరయ్య ఉదయం 8 గంటల సమయంలో ప్రయత్నించగా..

  • ఉద్యోగిని నిర్బంధించిన ఏపీ పోలీసులు

  • ఉన్నతాధికారుల చర్చలతో ప్రశాంతం

  • మా అధికారిదే తప్పు.. బదిలీ చేస్తాం : ఏపీ ఎస్‌ఈ కృష్ణమోహన్‌

నాగార్జునసాగర్‌, నవంబరు9 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ వద్ద శనివారం మరోసారి ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. సాగర్‌ ప్రాజెక్టు(తెలంగాణ) జేఈ కృష్ణయ్య కథనం ప్రకారం.. కుడికాల్వ వద్ద నీటి నిల్వల రీడింగ్‌ తీసుకునేందుకు వర్క్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వీరయ్య ఉదయం 8 గంటల సమయంలో ప్రయత్నించగా.. ఏపీ ఏఈ వెంకటసుబ్బయ్య అతణ్ని అడ్డుకున్నారు. దీంతో వీరయ్య ఉన్నతాధికారులకు ఫోన్‌లో విషయం చెప్పారు. ఉదయం 10 గంటల సమయంలో ఏపీ పోలీసులు అతణ్ని రైట్‌బ్యాంక్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. వెంకటసుబ్బయ్యతో వివాదం గురించి గంటపాటు విచారించి, వదిలిపెట్టారు.


దీనిపై తెలంగాణ నీటిపారుదల ఎస్‌ఈ శ్రీధర్‌రావు ఏపీ అధికారితోపాటు.. కృష్ణానది నిర్వహణ మండలి(కేఆర్‌ఎంబీ) అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో.. ఏపీ ఎస్‌ఈ కృష్ణమోహన్‌ డ్యామ్‌ వద్దకు వచ్చి, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడారు. తమ ఏఈ వెంకటసుబ్బయ్య తీరువల్లే ఇలా జరిగిందని, అతణ్ని వేరే ప్రాంతానికి బదిలీ చేస్తామని సర్దిచెప్పారు. సమన్వయలోపంతో జరిగిన వివాదాన్ని పెద్దదిగా చేయొద్దని విజ్ఞప్తి చేశారు. దాంతో వివాదం సద్దుమణిగింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో తెలంగాణ ఉద్యోగులు కుడికాల్వ వద్ద రీడింగ్‌ నమోదు చేసుకున్నట్లు జేఈ కృష్ణయ్య వివరించారు.

Updated Date - Nov 10 , 2024 | 03:02 AM