ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manda krishna: ఎమ్మార్పీఎస్‌ ర్యాలీ ఉద్రిక్తం

ABN, Publish Date - Oct 10 , 2024 | 04:10 AM

ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా 11వేల మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మార్పీఎస్‌ బుధవారం చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది.

  • ఎస్సీ వర్గీకరణ చేయకుండా టీచర్ల నియామక పత్రాలు ఇవ్వడంపై నిరసన

  • కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట

  • మందకృష్ణ మాదిగ సహా పలువురి అరెస్టు

కవాడిగూడ, బౌద్ధనగర్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా 11వేల మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మార్పీఎస్‌ బుధవారం చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. ఎమ్మార్పీఎస్‌ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాటలు, ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సహా పలువురు నేతల అరెస్టులతో సాగింది. హైదరాబాద్‌, పార్సీగుట్టలోని ఎమ్మార్పీఎస్‌ కేంద్ర కార్యాలయం నుంచి ఇందిరా పార్కు వరకు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీని ఇందిరా పార్కు సిగ్నల్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.


ఈ క్రమంలో ఎమ్మార్పీఎస్‌ శ్రేణులు, పోలీసులు మధ్య మొదలైన వాగ్వాదం తోపులాటకు దారి తీసింది. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో మంద కృష్ణ మాదిగ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. అరెస్టు సందర్భంగా మందకృష్ణ మాదిగ విలేకరులతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వడం వల్ల ఎంతో మంది మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి మాదిగలను మోసం చేశారని మండిపడ్డారు.


మాలల ఒత్తిడికి తలొగ్గి మాదిగలకు నమ్మకం ద్రోహం చేసిన ముఖ్యమంత్రికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాలలకు కొమ్ముకాస్తుందని మరోసారి రుజువైందని ఆరోపించారు. అక్టోబరు 15న ఎమ్మార్పీఎస్‌, అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని మందకృష్ణ తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్‌ నరేష్‌ మాదిగ, జాతీయ కార్యదర్శి తిప్పారపు లక్ష్మణ్‌, ఎంఎ్‌సఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2024 | 04:10 AM