కుట్రంతా కేసీఆర్‌దే..
ABN, Publish Date - Nov 30 , 2024 | 04:10 AM
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతుల్లో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కుట్ర చేశారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అప్పటి మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ కుటుంబ సభ్యులకు కేటాయించిన ఈ ఫ్యాక్టరీ కోసం కేసీఆర్ నిబంధనలు ఉల్లంఘించి ఆగమేఘాలపై అనుమతులిప్పించారని వెల్లడించింది.
నాటి మంత్రి తలసాని కోసం రైతులను ముంచే యత్నం..
నిబంధనలకు విరుద్ధంగా ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు
ముఖ్యమంత్రి కార్యాలయం
హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతుల్లో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కుట్ర చేశారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అప్పటి మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ కుటుంబ సభ్యులకు కేటాయించిన ఈ ఫ్యాక్టరీ కోసం కేసీఆర్ నిబంధనలు ఉల్లంఘించి ఆగమేఘాలపై అనుమతులిప్పించారని వెల్లడించింది. నాడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, ఉల్లంఘించిన నిబంధనలపై సీఎంవో శుక్రవారం నిలదీసింది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లేకుండానే కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వ మంత్రిమండలి ఆమోదించిందని, ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని తెలిపింది.
‘తలసాని కుటుంబానికి లబ్ధి చేసేందుకు దిలావర్‌పూర్ రైతులను ముంచేందుకు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫ్యాక్టరీకి అడ్డగోలుగా అనుమతులిచ్చింది. స్థానిక గ్రామ పంచాయతీ, మునిసిపాలిటీ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకోకుండా ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించేలా అనుమతించడం సీఎం హోదాలో కేసీఆర్ అధికార దుర్వినియోగానికి నిదర్శనం. పర్యావరణ సమస్యలు అధికంగా ఉండే రెడ్ జోన్‌లో ఈ పరిశ్రమ ఉన్నప్పటికీ.. అనుమతులు ఇచ్చి స్థానికులను మోసం చేసింది’ అని సీఎంవో వెల్లడించింది.
Updated Date - Nov 30 , 2024 | 04:10 AM