ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: విశ్వ బ్రాహ్మణులను ఒకటిగానే లెక్కించండి

ABN, Publish Date - Dec 03 , 2024 | 04:42 AM

సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ సమగ్ర కులగణన సర్వేలో విశ్వబ్రాహ్మణ లేదా విశ్వకర్మ కులంలోని కంసాలి, వడ్ల, కంచరి, కమ్మరి, శిల్పి వర్గాలను ఒకటే కులంగా లెక్కించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ సమగ్ర కులగణన సర్వేలో విశ్వబ్రాహ్మణ లేదా విశ్వకర్మ కులంలోని కంసాలి, వడ్ల, కంచరి, కమ్మరి, శిల్పి వర్గాలను ఒకటే కులంగా లెక్కించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కులగణనలో విశ్వబ్రాహ్మణులను ఒక్కటిగా లెక్కించకుండా ఆయా వర్గాలకు ప్రత్యేకంగా కోడ్‌ కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ విశ్వ బ్రాహ్మణ అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌, న్యాయవాది పెందోట శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ సూరేపల్లి నంద ధర్మాసనం విచారణ చేపట్టింది. విశ్వబ్రాహ్మణ కులంలో వివిధ వర్గాలకు ప్రత్యేకంగా కోడ్‌ ఇచ్చి లెక్కించడం వల్ల వారి జనాభా చాలా తక్కువగా నమోదవుతుందని.. మొత్తం జనాభాను ఒక్కటిగానే లెక్కించాలని పిటిషనర్‌ కోరారు.


ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆయా సబ్‌ క్యాటగిరీ వర్గాల్లో వెనుకబాటు తనాన్ని అంచనా వేయడానికి మాత్రమే ప్రత్యేక కోడ్‌లు ఇచ్చామని తెలిపారు. విశ్వబ్రాహ్మణ వర్గాలకు ఇచ్చిన సీరియల్‌ నంబరు 75 నుంచి 79 వరకు వచ్చిన లెక్కలను కలిపి చూపించేలా సాఫ్ట్‌వేర్‌ను సవరించాలని సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) సంస్థను ఆదేశిస్తామని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. విశ్వబ్రాహణ కులంలోని వివిధ వర్గాల లెక్కలను కలిపి ఒకే కులంగా పరిగణించాలని పేర్కొంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు పిటిషన్‌ను ముగించింది. కాగా, హైకోర్టు తీర్పు పట్ల పిటిషనర్‌, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకుడు పెందోట శ్రీనివాస్‌ హర్షం వ్యక్తం చేశారు. విశ్వబ్రాహ్మణులను వేర్వేరు కులాలుగా పేర్కొనడం వల్ల జనాభా సంఖ్య తగ్గుతుందని.. ప్రభుత్వ పథకాల్లో అన్యాయం జరిగే అవకాశం ఉన్నందునే హైకోర్టును ఆశ్రయించామని పేర్కొన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 04:42 AM