ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG : తెలంగాణ బాలుడి ఆచూకీ తిరుపతిలో లభ్యం

ABN, Publish Date - Aug 07 , 2024 | 05:08 AM

తెలంగాణకు చెందిన బాలుడు మహీధర రెడ్డి ఆచూకీ తిరుపతిలో లభ్యమైంది. డీఎస్పీ రవిమనోహరాచారి మంగళవారం వివరాలను మీడియాకు తెలిపారు.

తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 6: తెలంగాణకు చెందిన బాలుడు మహీధర రెడ్డి ఆచూకీ తిరుపతిలో లభ్యమైంది. డీఎస్పీ రవిమనోహరాచారి మంగళవారం వివరాలను మీడియాకు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని మీర్‌పేటకు చెందిన కవిత, మధుసూధనరెడ్డి దంపతుల కుమారుడు మహీధరరెడ్డి ఈ నెల 4వ తేదీ సాయంత్రం తన సోదరుడు మౌనేందర్‌ రెడ్డితో కలసి ట్యూషన్‌కు వెళ్లాడు.

ట్యూషన్‌ నుంచి మౌనేందర్‌ రెడ్డి ఇంటికి చేరగా, మహీధర రెడ్డి మాత్రం రాలేదు. ఎంతకీ రాకపోవడంతో చుట్టు పక్కల గాలించారు. ఫలితం లేకపోవడంతో మీర్‌పేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు.. మహీధర రెడ్డి తాను దాచుకున్న రూ.1000లతో హైదరాబాదు నుంచి ఆదివారం రాత్రి రైలెక్కి సోమవారం తిరుపతికి వచ్చాడు. తర్వాత తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తిరుపతి శ్రీహరి బస్టాండు వద్దకు చేరుకున్నాడు. అక్కడ బిక్కుబిక్కుమంటూ తచ్చాడుతున్న బాలుడిని బస్టాండులోని అవుట్‌ పోస్టు పోలీసులు చేరదీసి విచారించారు.

తల్లిదండ్రుల పేర్లు, అడ్రస్‌ చెప్పడంతో వెంటనే ఈస్ట్‌ పోలీసుస్టేషన్‌ వద్దకు తీసుకెళ్లారు. జరిగిన విషయాన్ని బాలుడు తల్లిదండ్రులకు తెలియచేసి తిరుపతి రమ్మని చెప్పారు. అనంతరం తిరుపతి ఈస్ట్‌ పోలీసుల వద్ద ఉన్న మహీధర రెడ్డిని ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో మంగళవారం సాయంత్రం డీఎస్పీ పర్యవేక్షణలో బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. బాలుడిని గుర్తించిన తిరుపతి ఆర్టీసీ బస్టాండు అవుట్‌ పోస్టు పోలీసులను పలువురు అభినందించారు.

Updated Date - Aug 07 , 2024 | 05:08 AM

Advertising
Advertising
<