ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG : దక్షిణాఫ్రికాలో పాఠ్య పుస్తకంగా ‘తెలుగు బడి’!

ABN, Publish Date - Aug 28 , 2024 | 06:08 AM

ఖండాంతరాల్లోనూ తెలుగు భాష వెలుగులు విరాజిల్లుతోంది. తన ప్రభను చాటుతోంది. దక్షిణాఫ్రికాలోని ఓ పాఠశాలలో ’తెలుగు బడి’ బాల వాచకాన్ని అక్కడి తెలుగు విద్యార్థుల కోసం పాఠ్యాంశంగా ఎంపిక చేశారు.

  • తెలుగు విద్యార్థుల కోసం బాలవాచకం

  • రచయిత కరీంనగర్‌ జిల్లా వాసి

కరీంనగర్‌ కల్చరల్‌, ఆగస్టు 27: ఖండాంతరాల్లోనూ తెలుగు భాష వెలుగులు విరాజిల్లుతోంది. తన ప్రభను చాటుతోంది. దక్షిణాఫ్రికాలోని ఓ పాఠశాలలో ’తెలుగు బడి’ బాల వాచకాన్ని అక్కడి తెలుగు విద్యార్థుల కోసం పాఠ్యాంశంగా ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాలో స్థిర పడిన వారు ఏర్పాటు చేసుకున్న తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు, రచయిత కూకట్ల తిరుపతి ఈ ‘తెలుగు బడి’ బాల వాచకాన్ని రచించారు. ఆధునిక పద్ధతిలో శాస్త్రీయ విధానం, సాంకేతికను జోడించి తిరుపతి ఈ పుస్తకాన్ని రూపకల్పన చేశారు.

తక్కువ రోజుల్లోనే సులువుగా తెలుగును చదవడం, రాయడం నేర్చుకునేలా పాఠాలున్నాయి. ఇందులో సరళ, గుణింత, ద్విత్వాక్షర, సంయుక్తాక్షర, సంశ్లేషాక్షర పదాలు పొందుపరిచి తెలిసిన విషయం నుంచి తెలియని విషయం వైపుగా బోధన జరిగేట్లు ప్రణాళికాబద్ధంగా వివరించారు. పుస్తకంలోని పాఠాల వద్ద క్యూఆర్‌ కోడ్‌ ఇవ్వడంతో విద్యార్థులకు ఇంటర్‌నెట్‌ ద్వారా ఈ పుస్తకంలోని పాఠాలు అందుబాటులో ఉంటాయి. జాతీయాలు, పొడుపు కథలు, సామెతల వివరాలను పొందుపరిచారు. ఇది తెలుగు సంస్కృతిని చాటేలా ఉండటంతో దక్షిణాఫ్రికా తెలుగువారు దీనిని తమ పిల్లలకు బోధించేందుకు పాఠ్యాంశంగా ఎంపిక చేసుకున్నారు.

Updated Date - Aug 28 , 2024 | 06:09 AM

Advertising
Advertising
<