ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నాటి వైభవం.. మట్టిపాలు..

ABN, Publish Date - Dec 21 , 2024 | 11:42 PM

చారిత్రక ఆలయం కాలగర్భంలో కలుస్తోంది. ఆది మానవుల కాలం మొదలు కొని నేటి వర కు అనేక చారిత్రాత్మక ఆధారాలకు నిలయంగా ఉన్న మండలంలోని ఇప్పగూడెం గ్రామ శివారు లోని నాగేంద్రస్వామి (నాగులమ్మ ఆలయం) శిథిలవస్థకు చేరింది.

పురాతన నాగేంద్రస్వామి ఆలయం

శిథిలావస్థలో నాగేంద్రస్వామి ఆలయం

ఆదిమానవులు, చాళుక్యులు ఏలిన ప్రాంతం..

విష్ణుకుండ్చలీకులు, శాతవాహనులు, కాకతీయుల ఆనవాళ్లు..

ఎన్నో ప్రత్యేకల నిలయం ఆలయం..

కాలగర్భంలో కలుస్తున్న చరిత్రాత్మక కట్టడాలు

పట్టించుకోని పాలకులు.. అధికారులు

స్టేషన్‌ఘన్‌పూర్‌, డిసెంబరు 21 (ఆంధ్ర జ్యోతి): చారిత్రక ఆలయం కాలగర్భంలో కలుస్తోంది. ఆది మానవుల కాలం మొదలు కొని నేటి వర కు అనేక చారిత్రాత్మక ఆధారాలకు నిలయంగా ఉన్న మండలంలోని ఇప్పగూడెం గ్రామ శివారు లోని నాగేంద్రస్వామి (నాగులమ్మ ఆలయం) శిథిలవస్థకు చేరింది. ఆదిమానవులు మొదలు కొని విష్ణుకుండ లీకులు, చాళుక్యులు, రాష్ట్రకూ టులు, శాతవాహనులు, కాకతీయ రాజుల ఆనవాళ్లు నాగులమ్మ గుడి వద్ద నేటికి కను విందు చేస్తున్నాయి. 17ఏళ్ల క్రితం వరకు నిత్య పూజలు జరిగేవని, నిత్యపూజలు జరగక పోవడంతో శిథిలావస్థకు చేరు కుంది. ఈ శివలింగం మహిమాన్విత మైనదిగా భక్తులు భావిస్తారు. శివరా త్రి సందర్భంగా మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన భక్తులు వ చ్చి దర్శించుకుంటారు.

ఆలయ ప్రత్యేకలు ఎన్నెన్నో..

ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. శివ లింగంపై సూర్యకిరణాలు పడి లింగం ప్రకాశవంతగా కనిపించేలా ఆలయ నిర్మాణం ఉండడం విశేషం. శివ లింగంకు ఎదురుగా నంది, గణపతి విగ్రహాలు ఉన్నా యి. ఆలయం ఎదుట రాతి స్తంభాలతో నిర్మించిన మంటపం చాళుక్యుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. శాతవాహనుల కాలంనాటి నాలుగు మూలల బావి, పందిపై కుక్కదాడి చేస్తున్న విగ్రహం, పాదాల బండ, స్త్రీ వీరగల్లుల చెక్కడాలు, 3వ, 4వ శతాబ్దాల మధ్యకాలంకు చెందిన సున్నపురాయితో తయారు చేసిన బుద్ధుడి విగ్రహం, 6వ శతాబ్దం నాటి కి చెందిన తార రాతి విగ్రహాలు నాటి వైభవానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పురావస్తుశాఖ అధికారులు నాలుగేళ్ల క్రితం ఆలయాన్ని సందర్శించి ఇక్కడి నుంచి తార, బుద్ధుడి విగ్రహాలను హైదరాబాద్‌లోని మ్యూజి యంలో భద్రపరిచారు. ఆలయం సమీపంలో శిథిల దేవాలయం ఆనవాళ్లు భాగంగా పెద్ద రాతికుప్ప నేటికీ కనిపిస్తుంది. గ్రామం నుంచి ఆలయంకు వెళ్లే దారిలో శివుని క్షేత్ర పాలకుడిగా పిలువబడే హనుమాన్‌ ఆల యం నిరాదా రణకు గురై ఉంది. రాతిపై చెక్కిన భారీ హనుమాన్‌ ప్రతిమను నిత్యం భక్తులు ఆకర్షిస్తోంది. ఆలయం వద్ద ఆదిమానవుల కాలంనాటి భారీ రాతికోల ఉండడంతో ఈ ప్రాంతంలో ఆదిమానవులు నివసించి ఉంటారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయంకు ఎగువ ప్రాంతానికి వెళ్లే క్రమంలో గుట్టకు భారీ వినా యక ప్రతిమ చెక్కబడి ఉండడంతో కాకతీయులు ఈ ప్రాతంలో ఉండేవారని చరిత్రకారులు చెబుతున్నారు.

స్త్రీ విరగల్లుల విగ్రహాలు...

పశు సంపదను కాపాడుకోవడానికి, తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి, పులులు, సింహాల నుంచి పశువులను కాపడడానికి గాను, రాజులను యుద్ధంలో కాపాడుకోవడానికి తాగ్యం చేసిన స్త్రీలు ఉండేవారు. వారి జ్ఞాపకార్థం చాళుక్యుల కాలంనాటి స్త్రీ వీరగల్లుల విగ్రహాలు దర్శనిమిస్తున్నాయి. తారాను స్త్రీ బోధిసత్వులుగా, స్త్రీల రూపంలో ఉండే బుద్ధులుగా పిలుస్తారు. తారా ఎంతో సౌందర్యవంతంగా ఉండే పురుషులు కొలిచే దైవంగా చెబుతారు. ఆమె కిరీటంలో ధ్యానం చేస్తున్న బుద్ధుడి శిల్పం కలిగిన కిరీటం ప్రత్యేక ఆకర్శనగా నిలుస్తోంది. తార విగ్రహం లభించడంతో రాష్ట్రంలో వజ్రాయాన బౌద్దం ఉంది అని చరిత్రకారులు నిర్ధారించుకున్నారు.

గుప్తనిధుల కోసం తవ్వకాలు..

పురాతన ఆలయం కావడంతో ఆలయం ద్వారా పాలకుల రాతి ప్రతిమలను పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఆలయం వెనుక భాగంలో, ఆలయం తూర్పు దిశలో మొత్తం మూడు పర్యాయాలు గుప్త నిదుల కోసం భారీ ఎత్తున తవ్వకాలు జరిపారు.

పర్యాటకంగా తీర్చిదిద్దాలి...

మందపురం ఎల్లాగౌడ్‌, ఇప్పగూడెం

నాగేంద్రస్వామి ఆలయాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలి. భవిష్యత్తు తరాలకు ఆలయ విశిష్టత తెలిసేలా అభివృద్ధి చేయాలి. శివరాత్రి వేడుకలకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

అధికారులు దృష్టిసారించాలి..

దాసరి రాజు, ఆలయ ఉత్సవ నిర్వాహకుడు

శిథిలావస్తకు చేరిన నాగులమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖ అధికారులు అభివృద్ధి చేయాలి. చరిత్ర నేపథ్యమున్న దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం స్పందించిన ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టాలి.

Updated Date - Dec 21 , 2024 | 11:43 PM