Tiger Sighting: భద్రాద్రి జిల్లాలో పెద్దపులి సంచారం
ABN, Publish Date - Dec 16 , 2024 | 04:52 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో రెండు రోజులుగా పెద్దపులి సంచరిస్తోంది.
కొత్తగూడెం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో రెండు రోజులుగా పెద్దపులి సంచరిస్తోంది. కరకగూడెం మండలంలోని రఘునాథపాలెం గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం పెద్దపులి అరుపులు వినిపంచడంతో గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. వారు అక్కడకు చేరుకుని పెద్దపులి పాదముద్రలను గుర్తించారు.
పెద్దపులి సంచారంపై కరకగూడెం అటవీ రేంజర్ ఉపేందర్ వివరణ కోరగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు బీట్ (ఎద) సమయంలో ఆడపులి కోసం ఛత్తీ్‌సగఢ్ నుంచి పెద్దపులి ఈ ప్రాంతానికి వస్తుందని తెలిపారు. ఇది ఎటువంటి హానిచేయదని, అడవిలోకి వెళ్లే పశువులపై దాడిచేసి చంపి ఆ పరిసరాల్లోనే సంచరిస్తుందని చెప్పారు. పశువులు మృతి చెందితే వాటి యజమానులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇస్తుందని చెప్పారు.
Updated Date - Dec 16 , 2024 | 04:52 AM