ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TS Assembly: ఇవాళ 9వ రోజు అసెంబ్లీ సమావేశాలు

ABN, Publish Date - Aug 02 , 2024 | 09:01 AM

నేడు 9వ రోజు అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. నేడు కూడా ప్రశోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. పలు శాఖల రిపోర్ట్‌ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.

హైదరాబాద్: నేడు 9వ రోజు అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. నేడు కూడా ప్రశోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. పలు శాఖల రిపోర్ట్‌ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. సభలో జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. జాబ్ క్యాలెండర్‌కు చట్టబద్ధతపై చర్చ జరగనుంది. ధరణిపై సభలో షార్ట్ డిస్కషన్ జరుగనుంది. గత 8 రోజులుగా సభ వాడీ వేడిగా సాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. రోజుకో రచ్చ.. రసవత్తరంగా చర్చ జరుగుతోంది. మొన్న రికార్డ్ స్థాయిలో సభ 17 గంటలకు పైగా జరిగింది.


నిన్న సభలో కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసగించిన, దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేసి బర్తరఫ్‌ చేసిన ఘనత కేసీఆర్‌దైతే.. సోనియాగాంధీ నేతృత్వంలో దళిత బిడ్డను స్పీకర్‌ను చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదని నిన్న సభలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేవలం దళిత బిడ్డను అధ్యక్షా అని సంబోధించడం ఇష్టం లేకే కేసీఆర్ సభకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బిడ్డ అయిన స్పీకర్‌ ఉన్నత స్థానంలో కూర్చుంటే ఆయన కింద కూర్చోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే సభకు రావడం లేదని ఆరోపించారు. దళితుల్ని మోసం చేసిన కేసీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడాలంటే... అధ్యక్షా మైక్‌ ఇవ్వండంటూ అడ్డుక్కునే పరిస్థితికి తీసుకువచ్చామని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్‌కు కాంగ్రెస్‌ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.


అసెంబ్లీలో స్కిల్‌ వర్సిటీ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ రాజకీయాలన్నీ అక్కలను అడ్డం పెట్టుకుని చేస్తోందని విమర్శించారు. సభలో అంశాల వారీగా మాట్లాడకుండా... అన్నీ కలగాపులగం చేస్తోందని మండిపడ్డారు. రైతు రుణ మాఫీ రెండో విడత నిధులు విడుదల చేస్తే... సభలో ఆ చర్చే జరగకుండా చేసిందని విమర్శించారు. ‘‘సబిత, సునీతా లక్ష్మారెడ్డిని నా సొంత అక్కలుగా భావించా. ఒక అక్క నడిబజారులో వదిలేసినా నేను ఏం అనలే. ఇంకో అక్క ఎన్నికల ప్రచారానికి వెళ్తే రెండు కేసులు అయినయి. ఈ రోజుకు కోర్టుల చుట్టు తిరుగుతున్నా. ఆదివాసీ బిడ్డ సీతక్క గురించి సోషల్‌ మీడియాలో మీమ్స్‌ చూస్తే.. అలా పెట్టిన వాళ్లను సబిత, సునీతలే చెప్పుతో కొడతారు.

Updated Date - Aug 02 , 2024 | 09:13 AM

Advertising
Advertising
<