ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: ఇవాళ రెండో రోజు తెలంగాణలో పర్యటించనున్న 16వ ఆర్థిక సంఘం

ABN, Publish Date - Sep 10 , 2024 | 08:51 AM

ఇవాళ రెండో రోజు తెలంగాణలో 16వ ఆర్థిక సంఘం పర్యటించనుంది. 12 గంటలకు ప్రజా భవన్‌‌లో సంఘం చైర్మన్ అర్వింద్ పణగారియా, సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు భేటీ కానున్నారు.

హైదరాబాద్: ఇవాళ రెండో రోజు తెలంగాణలో 16వ ఆర్థిక సంఘం పర్యటించనుంది. 12 గంటలకు ప్రజా భవన్‌‌లో సంఘం చైర్మన్ అర్వింద్ పణగారియా, సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు భేటీ కానున్నారు. అనంతరం ప్రజాభవన్‌లో ఆర్థిక సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధుల పెంపు విషయంలో ఆర్దిక సంఘాన్ని కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించాలని ప్రభుత్వం కోరనుంది. వర్షాలు, కరువులు వచ్చినప్పుడు జాతీయ విపత్తుల నిధులను పెంచేలా విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా రాష్ట్రాలకు పన్నుల ఆదాయం విషయంలో కూడా మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయనున్నారు.


రాష్ట్ర పర్యటనలో భాగంగా చైర్మన్‌ అరవింద్‌ పనగరియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం ఆదివారం హైదరాబాద్‌ చేరుకుంది. ఈ బృందంలో అజయ్‌ నారాయణ్‌ ఝా, యానీ జార్జి మ్యాథ్యూ, మనోజ్‌ పాండా, డాక్టర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ సభ్యులుగా ఉన్నారు. ఇక సోమవారం ఉదయం ప్రజాభవన్‌లో పట్టణ స్థానికసంస్థల ప్రతినిధులు, గ్రామీణ స్థానికసంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌/సభ్యులు, అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్ను వాటాను 50శాతానికి పెంచాలని 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ఆర్థిక సంఘం, వివిధ రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో కోరాయి. 14వ ఆర్థిక సంఘంలో 42శాతంగా ఉన్న వాటాను 15వ ఆర్థిక సంఘం 41శాతానికి కుదించిందని, దీనివల్ల ప్రగతిశీల రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని వివరించాయి. ఇలా అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఒకే సూచనను చేయడాన్ని 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ అర్వింత్‌ పనగారియా అభినందించారు.


ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, తమ సిఫార్సుల విషయంలో ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ కేంద్ర ఆర్థిక సంఘం సోమవారం ప్రజాభవన్‌లో వివిధ వర్గాలతో వరుస సమావేశాలను నిర్వహించింది. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్‌ డాక్టర్‌ అర్వింద్‌ పనగారియా, కార్యదర్శి, సభ్యులతోకూడిన బృందం తొలుత మునిసిపల్‌ కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీల మేయర్లు, చైర్మన్‌లతో సమావేశమైంది. అనంతరం గ్రామపంచాయతీల మాజీ సర్పంచులు, జడ్పీల చైర్‌పర్సన్లు, జడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్‌ అధ్యక్షులు, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య, సంఘ సభ్యులతో భేటీ అయ్యింది. ఆ తర్వాత పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు-- అలీఫ్‌, ఫిక్కీ, సీఐఐ ప్రతినిధులతో, సాయంత్రం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించింది.

Updated Date - Sep 10 , 2024 | 08:51 AM

Advertising
Advertising