Sajjanar: మేడారం మహాజాతరకు 6 వేల బస్సులు సిద్ధం
ABN, Publish Date - Feb 18 , 2024 | 05:57 PM
మేడారం మహాజాతరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మేడారం మహాజాతరపై ఆర్టీసీ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) హాజరయ్యారు.
వరంగల్: మేడారం మహాజాతరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మేడారం మహాజాతరపై ఆర్టీసీ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏబీఎన్‌తో సజ్జనార్ మాట్లాడుతూ... జాతరకు 6వేల బస్సులను సిద్ధం చేసినట్లు తెలిపారు. 15వేల మంది సిబ్బంది జాతర విధుల్లో ఉంటారని చెప్పారు. తెలంగాణలోని 51 పాయింట్ల నుంచి బస్సులు నడిపిస్తున్నట్లు వివరించారు. జాతర బస్సుల్లో కోళ్లు, మేకలకు అనుమతి లేదన్నారు. ఈ సారి జాతరకు రెండువేల బస్సులను అదనంగా నడుపుతున్నట్లు చెప్పారు. జాతర బస్సులకు నార్మల్ ఛార్జీలే తీసుకుంటామని సజ్జనార్ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 18 , 2024 | 08:19 PM