ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tummala: కొత్తగూడెం ఇంజనీరింగ్‌ కాలేజీని ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేయండి

ABN, Publish Date - Nov 07 , 2024 | 02:55 AM

కొత్తగూడెంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలను ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేయాలని సీఎం రేవంత్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో సీఎంను కలిసి వినతిపత్రం అందించారు.

  • మంత్రి తుమ్మల వినతి.. సీఎం సానుకూల స్పందన

ఖమ్మం, నవంబరు6(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కొత్తగూడెంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలను ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేయాలని సీఎం రేవంత్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో సీఎంను కలిసి వినతిపత్రం అందించారు. ఇంజనీరింగ్‌ కళాశాలను ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్శిటీగా మార్పు చేయడంతో పాటు యూజీ, మాస్టర్స్‌, పీహెచ్‌డీలలో భూగర్భశాస్త్రం, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సు, జియోఫిజిక్స్‌, జియోకెమిస్ట్రీ వంటి ప్రోగ్రాంలు అదనంగా చేర్చాలని విజ్ఞప్తి చేశారు.


దీనిపై సీఎం సానుకూలంగా స్పందించిన సీఎం.. త్వరలోనే కళాశాలను వర్శిటీ ఆఫ్‌ ఎర్త్‌సైన్సె్‌సగా మారుస్తామని హామీ ఇచ్చినట్టు తుమ్మల తెలిపారు. కాగా, సీఎంఆర్‌ఎ్‌ఫకు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ పాలకవర్గం రూ.1.51కోట్లు ప్రకటించింది. సంబంధిత చెక్కును మంత్రి తుమ్మల సీఎంకు అందించారు.

Updated Date - Nov 07 , 2024 | 02:55 AM