ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tummala: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

ABN, Publish Date - Nov 15 , 2024 | 04:11 AM

నిజామాబాద్‌ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. గతేడాది అక్టోబరులో ప్రధాని మోదీ జాతీయ పసుపు బోర్డును ప్రకటించారని, ఆ హామీని నెరవేర్చాలన్నారు.

  • ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి బోర్డు, ఆయిల్‌పామ్‌ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి

  • కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ

హైదరాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. గతేడాది అక్టోబరులో ప్రధాని మోదీ జాతీయ పసుపు బోర్డును ప్రకటించారని, ఆ హామీని నెరవేర్చాలన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి బోర్డు, ఆయిల్‌పామ్‌ పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు గురువారం కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల లేఖ రాశారు. నిజామాబాద్‌ జిల్లా పసుపు సాగులో ప్రసిద్ధి గాంచిందని, అక్కడి రైతులు దశాబ్దాలుగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు.


పసుపు, అనుబంధ ఉత్పత్తులు, విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులకు నిజామాబాద్‌ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు అనివార్యమని తెలిపారు. ఇక రాష్ట్రంలో 3,300 ఎకరాల్లో కొబ్బరి తోటలు సాగులో ఉన్నాయని, ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,757 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 696 ఎకరాల్లో తోటలున్నాయన్నారు. ఈక్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలని తుమ్మల కేంద్రాన్ని కోరారు. తెలంగాణలో ఇప్పటివరకు 91,200 హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ సాగుచేస్తున్నారని, ఏటా 40వేల హెక్టార్లలో సాగు విస్తీర్ణం పెంచే ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రాంతీయ ఆయిల్‌పామ్‌ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల కేంద్రాన్ని కోరారు.

Updated Date - Nov 15 , 2024 | 04:11 AM