ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttarakhand: పర్యాటకుల మృతి

ABN, Publish Date - Jul 06 , 2024 | 04:52 PM

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో కొండచరియలు విరిగిపడి.. బండరాళ్లు ఢీకొని ఇద్దరు హైదరాబాదీ పర్యాటకులు మృతి చెందారని పోలీసులు శనివారం వెల్లడించారు.

గోపేశ్వర్, జులై 06: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో కొండచరియలు విరిగిపడి.. బండరాళ్లు ఢీకొని ఇద్దరు హైదరాబాదీ పర్యాటకులు మృతి చెందారని పోలీసులు శనివారం వెల్లడించారు. మృతులు నిర్మలా శశి (36), సత్యనారాయణ(50)గా గుర్తించామన్నారు. కొండచరియలు విరిగిపడిన శిథిలాల కింద నుంచి వారి మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు. అయితే బద్రినాథ్ జాతీయ రహదారిపై చత్వాపీపల్ సమీపంలో గౌచర్, కర్ణప్రయాగ్ మధ్య ఈ ప్రమాదం జరిగిందన్నారు. బద్రినాథ్‌లో దేవుడిని దర్శించుకొని మోటర్ సైకిల్‌పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వివరించారు.

Also Read: KCR: రోజా ఇంట్లో చేపల పులుసు తిని..


Also Read: Tamil Nadu: ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య.. స్పందించిన మాయావతి

మరోవైపు భారీ వర్షాల కారణంగా బద్రీనాథ్ జాతీయ రహదారిపై పలు ప్రాంతాలను ముందస్తు చర్యల్లో భాగంగా మూసి వేశారు. ఇక రహదారిపై కొండ చరియలు విరిగి పడడంతో.. వాటిని నేషనల్ హైవే అథారాటీ ఆఫ్ ఇండియా, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషనన్‌కు చెందిన సిబ్బంది తొలగిస్తున్నారు. మరోవైపు ఎడతెరపి లేకుండా భారీ వర్షాల కారణంగా.. ముందస్తు చర్యల్లో భాగంగా రుద్రప్రయాగలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు శనివారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కుమావోన్, గర్వాల్‌ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది.

Also Read: Rohit: కోట్లలో ఆస్తులు.. ఆడి కారు.. విమానంలో టూర్లు..

భారీ వర్షాలు కారణంగా.. బద్రీనాథ్ దేవాలయం సమీపంలోని అలకనంద నదిలో ప్రవహించే నీటి మట్టం భారీగా పెరిగింది. అలాగే చమోలీ జిల్లాలోని బద్రినాథ్ జాతీయ రహదారిపై కొండ చరియలు భారీగా విరిగిపడ్డాయి. దీంతో రహదారులపై ప్రయాణానికి తీవ్ర అంటకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో రాకపోకలను ఉన్నతాధికారులు నిలిపివేశారు.

For Latest News and National News click here

Updated Date - Jul 06 , 2024 | 05:46 PM

Advertising
Advertising
<