ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Loan App: లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక..

ABN, Publish Date - Sep 10 , 2024 | 01:21 PM

లోన్ యాప్‌ల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అధిక వడ్డీతో పాటు లోన్ యాప్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుండటంతో మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

హైదరాబాద్: లోన్ యాప్‌ల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అధిక వడ్డీతో పాటు లోన్ యాప్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుండటంతో మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రుణ యాప్ నిర్వాహకుల వేధింపులకు ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లోన్ యాప్ వేధింపులు తాళలేక సుచిత్ర నివాసి వినోద్ ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందాడు. వరంగల్‌కు చెందిన వినోద్ తన భార్యాపిల్లలతో కలిసి.. హైదరాబాద్‌లోని సుచిత్ర ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతను లోన్ యాప్‌లో కొంత రుణం తీసుకున్నాడు.


తండ్రి అనారోగ్యం పాలవడంతో వైద్యం కోసం లోన్ యాప్‌లో తన భార్య పోటో పెట్టి కొంత మొత్తం లోన్ తీసుకున్నాడు. తొలుత బాగానే రుణం చెల్లించేవాడు. ఆ తరువాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా రుణం చెల్లింపులో కాస్త జాప్యం జరిగింది. ఈ మధ్య సకాలంలో చెల్లింపులు చేయలేకపోవడంతో రుణ యాప్ వేధింపులు ప్రారంభించింది. దీంతో లోన్ యాప్ నిర్వాహకులు దారుణానికి పాల్పడ్డారు. వినోద్‌ను అతని భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసి.. వారి బంధువులు, స్నేహితులకు పంపిస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో భయపడిన వినోద్ నానా తంటాలు పడి.. ఎట్టకేలకు రుణం మొత్తం చెల్లించాడు.


అయినా ఇంకా చెల్లించాలంటూ రుణ యాప్ నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. మొత్తంగా అప్పు చేసి మరీ 2 లక్షల రూపాయలకు పైగా చెల్లించాడు. అయినా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తగ్గలేదు. పైగా అన్నంత పనీ చేశారు. వినోద్ భార్య ఫోటోలు మార్ఫింగ్ చేసి అతని బంధువులు, స్నేహితులకు పంపించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వినోద్.. భార్యాపిల్లలను ఆదివారం తన తమ్ముడి ఇంటికి పంపించాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న సాయంత్రం ఇంటికి వచ్చిన భార్యకు వినోద్ విగతజీవిగా కనిపించాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తీవ్ర మనస్థాపంతో వినోద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించింది. వారం రోజుల క్రితం జీడిమెట్ల కు చెందిన బానుప్రకాష్ అనే విద్యార్థి.. లోన్ యాప్ వేధింపులు భరించలేక ఫాక్స్ సాగర్ లేక్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated Date - Sep 10 , 2024 | 01:22 PM

Advertising
Advertising