TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో.. ఆ వార్తల్ని ఖండించిన సజ్జనార్
ABN, Publish Date - May 23 , 2024 | 11:21 AM
టీఎస్ఆర్టీసీని టీజీఎస్ఆర్టీసీగా మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు.. ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్..
టీఎస్ఆర్టీసీ (TSRTC)ని టీజీఎస్ఆర్టీసీ (TGSRTC)గా మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు.. ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ (CV Sajjanar) తెలిపారు. ఇలా ఆ సంస్థ ఈ ప్రకటన చేయడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో ఒక లోగో దర్శనమిచ్చింది. ఇదే టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ ప్రచారం మొదలైంది. దీనిపై తాజాగా సజ్జనార్ స్పందించారు. కొత్త లోగో విషయంలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఇప్పటివరకూ అధికారికంగా కొత్త లోగోని సంస్థ విడుదల చేయలేదని స్పష్టం చేశారు.
Read Also: వామ్మో..! గుడ్లగూబ ఇలాంటి పనులు చేస్తాయా..?
‘‘TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఇప్పటివరకు అధికారికంగా కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోన్న లోగో ఫేక్. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ ఇంకా రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు’’ అని ఎక్స్ వేదికగా సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ లోగోని ఇంకా క్రియేట్ చేస్తున్నామని, అది పూర్తయ్యాక తామే అధికారికంగా ప్రకటిస్తామని ఆయన చెప్పకనే చెప్పేశారు. అప్పటిదాకా ప్రచారాలు నమ్మొద్దని తెలిపారు.
Read Also: విమానంలో విచిత్రం.. సీటు లేకపోవడంతో ఏం జరిగిందంటే?
ఇదిలావుండగా.. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ‘టీఎస్’ స్థానంలో ‘టీజీ’గా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే! ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో నివేదికలు, ఉత్తర్వులు, లెటర్ హెడ్‌లపై టీఎస్‌కి బదులు టీజీగా పేర్కొనాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్రం అనుమతి ఇస్తూ గెజిట్ జారీ చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే.. తొలుత వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి టీఎస్ తొలగించి టీజీగా మార్చింది. తాజాగా ఆర్టీసీ సైతం టీజీఎస్‌ఆర్టీసీగా మార్పులు చేసింది.
Read Latest Telangana News and Telugu News
Updated Date - May 23 , 2024 | 11:21 AM