ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS Politics: కాంగ్రెస్‌లోనే ఏక్ నాథ్ షిండేలు: కేపీ వివేకానంద్ గౌడ్

ABN, Publish Date - Mar 12 , 2024 | 10:26 PM

కాంగ్రెస్ పార్టీలోనే ఏక్ నాథ్ షిండేలు ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్(Vivekananda Goud) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాము గెట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్‌లోకి వస్తారని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని.. గేట్లుతెరిస్తే రావడానికి తమ ఎమ్మెల్యేలు గొర్రెలు కాదని మండిపడ్డారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోనే ఏక్ నాథ్ షిండేలు ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్(Vivekananda Goud) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాము గెట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్‌లోకి వస్తారని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని.. గేట్లుతెరిస్తే రావడానికి తమ ఎమ్మెల్యేలు గొర్రెలు కాదని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం మాటలను ఖండించారు. రేవంత్ రెడ్డి ఏదో అభద్రాబావంలో ఉన్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని రేవంత్ రెడ్డి బాడా బాయి అన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీనేతలే తమ ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో తెలువని పరిస్థితిలో ఉందని భయపడిపోతున్నారని చెప్పారు. పాలనపై ఇంకా రేవంత్‌రెడ్డికి పట్టురావడం లేదన్నారు. రేవంత్ రెడ్డికి సొంత పార్టీపైనే పట్టులేకుండా భయంభయంగా ఉన్నారన్నారు. సీఎం గత పండేళ్ల పాలనలో జరిగిన పనులు ఆపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పాలన సరిగ్గా చేయలేక ఎంపీ ఎన్నికలతో పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వేల కోట్లు పెట్టుబడులు వచ్చేవని.. వచ్చిన పెట్టుబడుతులు కూడా గుజరాత్ పోతున్నాయని చెప్పారు.రాష్ట్రంలో ప్రభుత్వం నిద్రపోతోందన్నారు.

ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికైతే కేవలం రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని చెప్పారు. గతంలోనేమో బీజేపీతో సంబంధాలు లేక అభివృద్ధి జరగలేదని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్‌లో కాంగ్రెస్ పెద్దనేతలే బీజేపీకి సపోర్టు చేశారని అన్నారు. కాంగ్రెస్‌కు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గతంలో వచ్చిన సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చారానా పనులకు బరాణా ప్రచారం చేసుకుంటుందని చెప్పారు. ప్రజాపాలన దరఖాస్తుల పరిస్థితి ఏంటని.. ప్రజలు ఆఫీసుల చుట్టు తిరిగి విసిగిపోతున్నారని మండిపడ్డారు. గత వందరోజులు పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు బంధు ఊసే లేదని పెన్షన్లు రావడం లేదని చెప్పారు. జాబ్ క్యాలెండర్‌పై మాట్లాడటం లేదన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు యాదగిరి దేవాలయంలో అవమానం జరిగిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి భట్టికి జరిగిన అవమానంపై స్పందించాలని ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. సహచర మంత్రులకు భయపడుతున్నారా..? అని విమర్శించారు. పార్టీలో చేరికలపై గేట్లు తెరువడం కాదని.. మేడిగడ్డను రిపేర్ చేసి గేట్లు మూసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం అజ్ఞాన, అరాచన మాటాలు మానుకోవాలని హితవు పలికారు. రేవంత్ టార్గెట్ పెట్టుకున్న 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో 13 హామీలు నెరవేర్చాలని కేపీ వివేకానంద్ గౌడ్ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2024 | 10:28 PM

Advertising
Advertising