TS NEWS: హనుమకొండ హరిత హోటల్లో అగ్ని ప్రమాదం.. ఈ ఘటనపై పలు అనుమానాలు
ABN, Publish Date - Mar 02 , 2024 | 09:21 PM
నగరంలోని హరిత హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కిచెన్‌లో అకస్మాత్తుగా మంటలు గా చెలరేగాయి.ఈ సంఘటనతో హోటల్ సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై మంటలను సిబ్బంది ఆర్పివేశారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ అగ్నిప్రమాదంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
హనుమకొండ: నగరంలోని హరిత హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కిచెన్‌లో అకస్మాత్తుగా మంటలు గా చెలరేగాయి.ఈ సంఘటనతో హోటల్ సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై మంటలను సిబ్బంది ఆర్పివేశారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ అగ్నిప్రమాదంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హరితలో అక్రమాలపై ఏబీఎన్ లో కథనాలతో ఉన్నతాధికారులు కదిలారు. విచారణకు ఎండీ రమేష్ నాయుడు ఆదేశించారు. విచారణ అధికారిగా జనరల్ మేనేజర్ నాథన్ నియమించారు.
హరితలో క్షేత్రస్థాయి విచారణకు అధికారులు సిద్ధమయ్యారు. ఇవాళ ఒక్కసారిగా హరిత కిచెన్‌లో మంటలు చెలరేగాయి. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి విచారణకు వస్తున్నారని తెలిసి ఇక్కడి అధికారులే మంటలు లేపారా..? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫుడ్ మెటిరీయల్‌కు లెక్కలు లేవని ఏబీఎన్‌లో కథనాలు వచ్చాయి. లెక్కాపత్రం లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని ఏబీఎన్ కథనాలు ప్రసారమయ్యాయి. అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఏబీఎన్ వరుస కథనాలు ప్రసార చేసింది. హరితలో సీసీ కెమెరాల మానిటరింగ్ సెల్ కిచెన్ పక్కనే ఉండటంతో అగ్నిప్రమాదంపై అనుమానాలకు తావిచ్చినట్లు అయింది. అత్యాధునిక పద్ధతులతో నిర్మించిన కిచెన్‌లో మంటలు చెలరేగడంతో అనుమానాలు బలపడుతున్నాయి.
Updated Date - Mar 02 , 2024 | 09:21 PM