ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Madaram: నేటి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం..

ABN, Publish Date - Feb 21 , 2024 | 08:35 AM

ములుగు: మేడారం మహాజాతర బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. మహాజాతరలో ఈరోజు తొలిఘట్టం ఆవిష్కృతం కానుంది. కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి సారలమ్మ రానుంది. ఆదివాసి సంప్రదాయంలో పూజలు చేసి కన్నెపల్లి నుంచి అమ్మవారిని తరలిస్తారు. ఈఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు మేడారంకు పోటెత్తారు. భక్తకోటి మూట, ముల్లే కట్టుకుని మేడారం వైపు అడుగులు వేస్తున్నారు.

ములుగు: మేడారం (Madaram) మహాజాతర (Maha Jatara) బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. మహాజాతరలో ఈరోజు తొలిఘట్టం ఆవిష్కృతం కానుంది. కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి సారలమ్మ (Saralamma) రానుంది. ఆదివాసి సంప్రదాయంలో పూజలు చేసి కన్నెపల్లి నుంచి అమ్మవారిని తరలిస్తారు. ఈఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు (Devotees) మేడారంకు పోటెత్తారు. భక్తకోటి మూట, ముల్లే కట్టుకుని మేడారం వైపు అడుగులు వేస్తున్నారు.

వన దేవతల్లో ఒకరైన సారలమ్మ బుధవారం మేడారం గద్దె మీదకు రానుంది. పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా గద్దె మీదకొస్తారు. సారలమ్మ మేడారానికి వేంచేయడంతోనే నాలుగురోజుల మహాజాతరకు తెరలేవనుంది. ఈ మేరకు బుధవారం తెల్లవారుజాము నుంచే సారలమ్మ కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు మొదలవుతాయి. పొద్దున్నే సారలమ్మ ఆలయాన్ని శుద్ధి చేసి.. ఆలికి ముగ్గులతో అలంకరిస్తారు. ప్రధాన పూజారి అయిన కాక సారయ్య పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం ఆదివాసీ పూజారులు రహస్య పూజలు చేస్తారు. ఈ సమయంలోనే పూజారి సారయ్యను సారలమ్మ ఆవహిస్తుంది. తర్వాత సారలమ్మ (సారయ్య రూపంలో)ను ఆలయం నుంచి గద్దెల వైపు పూజారులు తీసుకొస్తారు. సమ్మక్క గారాల బిడ్డ అయిన సారలమ్మ ధైర్యానికి, వీరత్వానికి, త్యాగానికి ప్రతీక. 12వ శతాబ్దాంలో తమ గిరిజన ప్రాంతాన్ని కాపాడుకునేందుకు కాకతీయలతో సారలమ్మ యుద్ధం సాగించిన తీరును, వీరమరణం ద్వారా ఆమె త్యాగాన్ని భక్తులు స్మరించుకుంటూ దైవంగా కొలుస్తారు. తల్లిని మొక్కితే సంతానం ప్రాప్తిస్తుందని, రుగ్మతలు పోతాయని భక్తుల విశ్వాసం. ఫలితంగా మేడారానికి సాగుతున్న సమయంలో సారలమ్మకు కన్నెపల్లిలో భక్తులు ఎదురెళ్లి మంగళహారతులు ఇస్తారు. సంతానం కలగాలని, సమస్యలు తీరాలని తడి బట్టలతో భక్తులు వరం పడతారు.

సారలమ్మ వీధిలోకి రాగానే పూజారులు పీటలు వేసి కాళ్లు కడిగి.. మంగళహారతులు ఇచ్చి తల్లిని సాగనంపుతారు. సారలమ్మ కన్నెపల్లి మీదుగా తన తమ్ముడు జంపన్నను పలకరిస్తూ జంపన్నవాగును దాటి సాయంత్రానికి గద్దెకు చేరుకుంటుంది. అలాగే మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజును .. ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి పగిడిద్దరాజు తమ్ముడు గోవిందరాజును పడిగె రూపాల్లో రాత్రి 8 గంటలవరకు గద్దెపైకి తీసుకొస్తారు. 22న అంటే.. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెకు చేర్చుతారు. ఆ రోజు మహాజాతర మరోస్థాయికి చేరుతుంది. 24న సాయం త్రం వనదేవతలు తమ తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమవుతారు. కాగా, ఈసారి జాతర కు 1.3 కోట్ల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తులకు ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా రూ.105 కోట్ల నిధులు కేటాయించింది. తాత్కాలికంగా 5,600 మరుగుదొడ్లు నిర్మించారు. 200 దాకా ఉన్న శాశ్వత మరుగుదొడ్లకు మరమ్మతులు చేశారు. మేడారం, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, నార్లాపూర్‌ తదితర చోట్ల 354 బ్యాటరీ ఆఫ్‌ ట్యాప్స్‌ను ఏర్పాటు చేశారు. జాతర ఏర్పాట్లను మంత్రులు సీతక్క, పొన్నం, కొండా సురేఖ, పొంగులేటి పర్యవేక్షిస్తున్నారు. జాతర మూడోరోజు, శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మేడారానికి వస్తున్నారు.

మేడారానికి ఎలా వెళ్లాలి?

మేడారం వచ్చే భక్తులు హైదరాబాద్‌ నుంచైతే తొలుత వరంగల్‌కు రావాలి. రైలులో వచ్చే భక్తులైతే ఖాజీపేట, వరంగల్‌ రైల్వేస్టేషన్లలో దిగి అక్కడి నుంచి నేరుగా 163 జాతీయ రహదారిపై నుంచి ములుగు-ఏటూరునాగారం ప్రధాన రహదారి వెంట వెళ్లాల్సి ఉంటుంది. హనుమకొండ నుంచి 85 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే పస్రా వస్తుంది. అక్కడి నుంచి ఎడమ వైపునకు మేడారం రహదారి ఆర్చీతో స్వాగతం పలుకుతుంది. పస్రా నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే మేడారం చేరుకోవచ్చు. ఒకవేళ ఆర్టీసీ బస్సులో ప్రయాణించాల్సి వస్తే హనుమకొండ బస్టాండ్‌ నుంచి నేరుగా మేడారానికి వందలాది బస్సులు సిద్ధంగా ఉంటాయి.

జాతరకు ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌,: తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో పాల్గొనే భక్తులు, సందర్శకుల కోసం రాష్ట్ర పర్యాటక సంస్థ ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. నాలుగు రోజుల పాటు ఉదయం 6:30 గంటలకు సికింద్రాబాద్‌ యాత్రి నివాస్‌, బషీర్‌బాగ్‌ సెంట్రల్‌ రిజర్వేషన్‌ కార్యాలయం నుంచి ఎసీ, నాన్‌ ఎసీ, వోల్వో బస్సులు బయలుదేరుతాయని పర్యాటక సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమేష్‌ నాయుడు తెలిపారు. ఈ బస్సుల్లో వెళ్లే భక్తులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసినట్లు వివరించారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో పర్యాటకులకు వరంగల్‌ వేయి స్తంభాల గుడి, పరిసర ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 10:30కు హైదరాబాద్‌ చేరుకోవచ్చని అన్నారు. ఒక్క రోజులోనే దర్శనం పూర్తి చేసుకుని, మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పర్యాటక సంస్థ ప్రత్యేక బస్సులను వినియోగించుకోవచ్చని సూచించారు.

Updated Date - Feb 21 , 2024 | 08:35 AM

Advertising
Advertising