ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MLA Rakesh Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే దేశం ముక్కలవుతుంది

ABN, Publish Date - Mar 01 , 2024 | 05:09 PM

ఉచిత పథకాలతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రజలను బిచ్చగాళ్లను చేస్తున్నారని అర్ముర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి(MLA Rakesh Reddy) అన్నారు. శుక్రవారం నాడు హనుమకొండలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ముఖ్య అతిథిగా రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.

హనుమకొండ: ఉచిత పథకాలతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రజలను బిచ్చగాళ్లను చేస్తున్నారని అర్ముర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి(MLA Rakesh Reddy) అన్నారు. శుక్రవారం నాడు హనుమకొండలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ముఖ్య అతిథిగా రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ యాత్రలో బీజేపీ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ అంటేనే అవినీతి, ఆ పార్టీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తే దేశం మళ్లీ ముక్కలవుతుందని ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి మేనేజ్ మెంట్, పేమెంట్ కోట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్... అభివృద్ధికి నిలయం బీజేపీ అని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన అందరినీ అరెస్ట్ చేయాలని.. సీబీఐ విచారణ చేయించాలని కోరారు. రేవంత్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోతుందని చెప్పారు. రేవంత్ తన స్థాయికి తగ్గట్లుగా మాట్లాడాలని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీపై యుద్ధం చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలా యుద్ధం చేస్తా అన్న ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలే ఇంట్లో కూర్చున్నారని పైడి రాకేష్ రెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి

BJP: 65 శాతం ముస్లింలకు మోదీ పథకాలతో లబ్ది: కొండా విశ్వేశ్వరరెడ్డి

Uttamkumar: ఇక షెడ్డుకు పోవాల్సిందే.. బీఆర్‌ఎస్‌ నేతల‌కు ఉత్తమ్ సెటైర్

Big Breaking: బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’ పర్యటనలో ఊహించని ఘటన.. భయపడిపోయిన ఎమ్మెల్యేలు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి....

Updated Date - Mar 01 , 2024 | 05:09 PM

Advertising
Advertising