ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: కేయూలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు..

ABN, Publish Date - Mar 10 , 2024 | 12:16 PM

వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా గత ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీ కాంపౌండ్ నిర్మించలేదని విమర్శించారు.

వరంగల్: కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University)లో పలు అభివృద్ధి పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy), సీతక్క (Sitakka), కొండా సురేఖ (Konda Surekha) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా గత ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీ కాంపౌండ్ నిర్మించలేదని విమర్శించారు. ఇప్పుడు కాంపౌండ్ వాల్‌కు శంకుస్థాపన చేశామని, తమ ప్రభుత్వం విద్యా, వైద్యరంగానికి పెద్దపీట వేస్తుందన్నారు.

రేపు (సోమవారం) ఇందిరమ్మ ఇళ్ల (Indiramma houses) కార్యక్రమం ప్రారంభం కాబోతోందని, ప్రభుత్వం ఏర్పడిన 75 రోజుల్లోనే 31వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. టీఎస్‌పీఎస్సీని (TSPSC)ని పునరుద్ధరించి ఉద్యోగ నోటీఫికేషన్లు ఇస్తున్నామన్నారు. కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వర్సిటీలో అడుగుపెట్టిన మంత్రులం తామేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - Mar 10 , 2024 | 12:18 PM

Advertising
Advertising