ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Politics: కేసు పెట్టి జైల్లో వేస్తారేమో.. బీఆర్ఎస్ నేత సంచలన కామెంట్స్..

ABN, Publish Date - Jan 18 , 2024 | 03:52 PM

వరంగల్, జనవరి 18: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తారేమో అని, అయినా జైలుకు వెళ్లేందుకు సిద్ధం అని అన్నారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన గండ్ర వెంకట రమణ.. పోలీసులు నిబంధనలకు లోబడి పని చేయాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏది చెబితే అది చేయడం సబబు కాదన్నారు.

Telangana Politics

వరంగల్, జనవరి 18: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తారేమో అని, జైలుకు వెళ్లేందుకు సిద్ధం అని అన్నారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన గండ్ర వెంకట రమణ.. పోలీసులు నిబంధనలకు లోబడి పని చేయాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏది చెబితే అది చేయడం సబబు కాదన్నారు. తనపై, తన కుటుంబ సభ్యులపై ఒక రౌడీ షీటర్‌తో ప్రైవేట్ ఫిర్యాదు ఇప్పించి కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. ఆలయం కడితే స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులపై హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నామన్నారు.

భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఆర్ అండ్ బీ అతిథి గృహం, ఆలయం అన్నీ ఒకే సర్వే నెంబర్‌లో ఉన్నాయని వివరించారు వెంకట రమణారెడ్డి. గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన తనపై కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గుడిని ఆనుకునే ఆలయ అవసరాల కోసం కాంప్లెక్స్ కట్టామన్నారు. అది ఆలయం ఆస్తి తప్ప తన సొంత ఆస్తి కాదని అన్నారు. 'కేసు నమోదు చేస్తారు.. జైలుకు పంపుతారేమో వెళ్తాను' అని వ్యాఖ్యానించారు వెంకటరమణా రెడ్డి.

Updated Date - Jan 18 , 2024 | 03:52 PM

Advertising
Advertising