Warangal: వచ్చే ఆగస్టుకల్లా కోచ్ ఫ్యాక్టరీ పూర్తి
ABN, Publish Date - Nov 29 , 2024 | 04:53 AM
వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాకారమైందని, ఇది సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే నెరవేరిందని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య అన్నారు.
సీఎం రేవంత్ వల్లే సాధ్యమైంది: కడియం కావ్య
న్యూఢిల్లీ, నవంబర్ 28 (ఆంధ్రజ్యోతి): వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాకారమైందని, ఇది సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే నెరవేరిందని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య అన్నారు. 2025 ఆగస్టు వరకు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తవుతుందని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారని చెప్పారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణభవన్ పార్టీ ఎంపీలు మల్లు రవి, రామసహాయం రఘురామిరెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్‌లతో కలిసి కావ్య మీడియాతో మాట్లాడారు. ‘పదేళ్లలో కేసీఆర్ ఏనాడూ ఢిల్లీ పెద్దలను కలవలేదు.
కానీ సీఎం రేవంత్ గతేడాది జూలై, ఆగస్టు, ఈ ఏడాది మార్చిలో ఢిల్లీకి వచ్చి కేంద్రమంత్రులను కలిశారు. విభజన హామీల ప్రకారం కోచ్ ఫ్యాక్టరీ కలను నెరవేర్చారు’ అని స్పష్టం చేశారు. కోచ్ ఫ్యాక్టరీతోపాటు విమానాశ్రయం, వెల్‌నెస్ సెంటర్, గిరిజన యూనివర్సిటీ.. ఇలా రెండో రాజధానిగా వరంగల్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. మల్లు రవి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలపై బీఆర్‌ఎస్ వాళ్లు ఆరోపణలు చేస్తున్నారని, రేవంత్ ఢిల్లీకి రావడం వల్లే ఇవన్నీ సాకారమవుతున్నాయని చెప్పారు.
Updated Date - Nov 29 , 2024 | 04:53 AM