Ponnam Prabhakar: దసరా లోపు 30 డీలక్స్, 30 ఎక్స్‌ప్రెస్ బస్సులను మంజూరు చేస్తాం

ABN, Publish Date - Jul 13 , 2024 | 01:38 PM

నల్గొండ ఆర్టీసీ డిపో నుండి హైదరాబాద్ కు నూతనంగా ఏర్పాటు చేసిన ఏసీ బస్సు, మూడు రాజధాని బస్సులను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

Ponnam Prabhakar: దసరా లోపు 30 డీలక్స్, 30 ఎక్స్‌ప్రెస్ బస్సులను మంజూరు చేస్తాం

నల్గొండ: నల్గొండ ఆర్టీసీ డిపో నుండి హైదరాబాద్ కు నూతనంగా ఏర్పాటు చేసిన ఏసీ బస్సు, మూడు రాజధాని బస్సులను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దసరా లోపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు 30 డీలక్స్, 30 ఎక్స్‌ప్రెస్ బస్సులను మంజూరు చేస్తామని తెలిపారు. నార్కెట్ పల్లి డిపోకు పునర్వైభవం తీసుకొచ్చి అక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు బస్సులు నడుపుతామన్నారు.


నల్గొండ నుంచి తిరుపతి, హైదరాబాద్ లకు ఏసీ బస్సులను మంజూరు చేస్తామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హైదరాబాద్ తర్వాత ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, 35 లక్షల జనాభాను కలిగి అతి పెద్ద జిల్లాగా నల్గొండ ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తానికి 100 బస్సులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - Jul 13 , 2024 | 01:38 PM

Advertising
Advertising
<