ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jishnu Dev Varma: తెలంగాణ కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. అసలు ఎవరీయన?

ABN, Publish Date - Jul 29 , 2024 | 11:53 AM

రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ నియమితులైన విషయం తెలిసిందే. ఆయన ఈ నెల 31న రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ( Jishnu Dev Varma) నియమితులైన విషయం తెలిసిందే. ఆయన ఈ నెల 31న రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు (TS HIgh Court) చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. తమిళిసై సౌందరరాజన్ (Tamilisai) స్థానంలో సీపీ రాధాకృష్ణ (CP Radha Krishna)ను ఇన్‌చార్జి గవర్నర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించిన విషయం తెలిసిందే. ఆయన సోమవారం రిలీవ్ కానున్నారు. రాధాకృష్ణ మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. రాధాకృష్ణన్ సహా మొత్తం 9 రాష్ట్రాలకు రాష్ట్రపతి గవర్నర్లను నియమించారు. ఇక రాధాకృష్ణ స్థానంలో జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చెప్పట్టనున్నారు.


ఈ సందర్భంగా సోమవారం రాజ్ భవన్‌ (Raj Bhavan)కు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)తో పాటు పలువురు మంత్రులు వెళ్లి రాధాకృష్ణన్ కు వీడ్కోలు పలికారు. కాగా.. బోనాల సందర్భంగా ప్రజలకు రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. మహాంకాళి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలకు ఉండాలని, పంటలతో రాష్ట్రం సస్యశ్యామలం కావాల ని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఈ నెల 31వతేదీ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ బాధ్యతలు చేపట్టనున్నారు.


జిష్ణు దేవ్ వర్మ 1957 ఆగస్టు 15న జన్మించారు. త్రిపుర రాష్ట్ర పూర్వపు రాజవంశానికి చెందిన జిష్ణు దేవ్ వర్మ.. రామజన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. ఆయన గతంలో 2018 నుంచి 2023 వరకూ త్రిపురలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలలో జిష్ణు దేవ్ వర్మ సెపాహిజాలా జిల్లాలోని చరిలం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జిష్ణు దేవ్ వర్మ రచయిత కూడా కావడం విశేషం. ఆయన ఇటీవల తన జ్ఞాపకాల "Views, Reviews & My Poems" పేరుతో పుస్తకం విడుదల చేశారు. అంతే కాకుండా జిష్ణు దేవ్ వర్మ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు కూడా కావడం గమనార్హం. ఆయన సతీమణి పేరు సుధా దేవ్ వర్మ.

ఇవి కూడా చదవండి...

Rajasthan: సీఎంను హత్య చేస్తామంటూ బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు

Social Media: చైనాలో ఇండియన్ ఇన్‌ఫ్లూయన్సర్‌ చేసిన వీడియోపై దుమ్మెత్తి పోస్తున్న భారతీయులు

Read Latest Talangana News And Telugu News

Updated Date - Jul 29 , 2024 | 12:21 PM

Advertising
Advertising
<