యాదవులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి
ABN, Publish Date - Dec 28 , 2024 | 01:14 AM
యాదవులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగి ఐక్యమత్యంగా ఉం డాలని అఖిలభారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండలుయాదవ్ అన్నారు.
యాదవులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి
దేవరకొండ, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): యాదవులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగి ఐక్యమత్యంగా ఉం డాలని అఖిలభారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండలుయాదవ్ అన్నారు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన భవనంలో శుక్రవారం నిర్వహించిన యాదవ సంఘ నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యాదవులు రాజకీయాలల్లో రాణించాలన్నారు. ఈ నెల 29వ తేదీన దేవరకొండ వైష్ణవి ఫంక్షనహాల్‌లో జరగనున్న చందంపేట, నేరేడుగొమ్ము మండలాల ముఖ్యనేతల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆయా మండలాల నూతన కమిటీలను ఎ న్నుకోన్నుట్లు పేర్కొన్నారు. యాదవులు అధిక సంఖ్య లో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో యాదవ సంఘం చందంపేట మండల అధ్యక్షుడు వశ్య నారాయణ, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, నాయకులు ఏర్పుల గోవిందు, నర్సింహయాదవ్, శ్రీశైలం యాదవ్, ఎనవీటీ, గడ్డం వెంకటయ్య, యాదవసంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2024 | 01:14 AM