Viral Video: ఫ్లై ఓవర్‌పై కారు ఢీ.. పిల్లర్‌పై ఇరుక్కుపోయిన యువతి

ABN, Publish Date - Sep 21 , 2024 | 09:49 PM

నోయిడాలోని సెక్టార్ 31లో ఓ యువతికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ యువతి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ పైనుంచి స్కూటీతో సహా జారి ఓ పిల్లర్‌పై పడింది.

Viral Video: ఫ్లై ఓవర్‌పై కారు ఢీ.. పిల్లర్‌పై ఇరుక్కుపోయిన యువతి

యూపీ: నోయిడాలోని సెక్టార్ 31లో ఓ యువతికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ యువతి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ పైనుంచి స్కూటీతో సహా జారి ఓ పిల్లర్‌పై పడింది. స్కూటీ పిల్లర్‌పై ఆగకపోయి ఉంటే.. ఆమె కింద రోడ్డుపై పడి ఉండేది. ఫ్లైఓవర్ పైనుంచి ఆమె వెళుతున్న స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కొందరు ఫ్లైఓవర్ పై నుంచి యువతిని రక్షించేందుకు యత్నించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది యువతిని కిందకు తీసుకొచ్చారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - Sep 21 , 2024 | 09:50 PM