Air India: తప్పిన పెను ప్రమాదం..140 మంది సేఫ్
ABN, Publish Date - Oct 11 , 2024 | 09:18 PM
తిరుచ్చి ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం కలకలం రేపింది. తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న AXB 613 విమానంలో శుక్రవారం సాయంత్రం సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 140 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
చెన్నై: తిరుచ్చి ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం కలకలం రేపింది. తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న AXB 613 విమానంలో శుక్రవారం సాయంత్రం సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 140 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. టేకాఫ్ అయిన కాసేపటికే ఈ లోపం ఏర్పడింది. అనంతరం గంటన్నరకుపైగా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. దీంతో తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించాడు. ముందస్తు జాగ్రత్తగా ఇప్పటికే తిరుచ్చి ఎయిర్‌పోర్ట్ వద్ద 20 అంబులెన్స్‌లు..20 ఫైరింజన్‌లు సహా మెడికల్ టీమ్స్‌ను సిద్ధంగా ఉంచారు. భారీగా పారామెడికల్ సిబ్బంది రంగంలోకి దిగారు. చివరకు విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో 140 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు ఈ వీడియోలో..
Updated Date - Oct 11 , 2024 | 09:18 PM