ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ ప్రచారం ఆపండి: అల్లు అరవింద్..

ABN, Publish Date - Dec 21 , 2024 | 09:15 PM

భారతీయ సినీ చరిత్రలోనే పుష్ప-2 సినిమా కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేసిందని అల్లు అర్జున్ తండ్రి అరవింద్ అన్నారు. కానీ, సినిమా కోసం అంత కష్టపడిన అర్జున్ మాత్రం థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులు తనపై చూపించే ప్రేమను కళ్లారా చూడలేకపోతున్నారని అల్లు అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్: సంధ్యా థియేటర్ (Sandya Theater) ఘటనలో తన కుమారుడు అల్లు అర్జున్‌ (Allu Arjun)పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆపాలని అల్లు అరవింద్ (Allu Aravind) విజ్ఞప్తి చేశారు. భారతీయ సినీ చరిత్రలోనే పుష్ప-2 (Pusha-2) సినిమా కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేసిందని అరవింద్ చెప్పారు. కానీ, సినిమా కోసం అంత కష్టపడిన అర్జున్ మాత్రం థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులు తనపై చూపించే ప్రేమను కళ్లారా చూడలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంధ్యా థియేటర్ ఘటన చాలా దురదృష్టకరమని, ఆ ఘటనతో బన్నీ ఎంతో ఆవేదనకు గురయ్యారని అరవింద్ తెలిపారు. గత రెండు వారాలుగా ఇంట్లో ఉన్న గార్డెన్‌లోనే బన్నీ గడుపుతున్నారని, స్నేహితులు లేదా బంధువుల ఇళ్లకి వెళ్లమని తాను చెప్పినా వెళ్లడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, కొంతమంది ఆ ఘటనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇకనైనా తన కుమారుడిపై అసత్య ప్రచారం ఆపాలని అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు.

Updated Date - Dec 21 , 2024 | 09:24 PM