మందుబాబులను ఉరికిస్తున్న డ్రోన్లు
ABN, Publish Date - Nov 28 , 2024 | 08:56 PM
బహిరంగ ప్రదేశాల్లో గంజాయి, మద్యం సేవిస్తున్న మందు బాబుల పని పట్టేందుకు అనంతపురం జిల్లా పోలీసులు సమాయత్తమయ్యారు. అందులోభాగంగా డ్రోన్లతో వారిపై నిఘా పెట్టారు. నగర శివారు ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్న మందుబాబులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో గంజాయి, మద్యం సేవిస్తున్న మందు బాబుల పని పట్టేందుకు అనంతపురం జిల్లా పోలీసులు సమాయత్తమయ్యారు. అందులోభాగంగా డ్రోన్లతో వారిపై నిఘా పెట్టారు. నగర శివారు ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్న మందుబాబులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గత రెండు రోజులుగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని పోలీసులు గుర్తించారు.
అయితే డ్రోన్ల శబ్దం విన్న మందుబాబులు అక్కడి నుంచి పరుగ తీశారు. రైల్వే ట్రాకుల వద్ద మద్యం సేవిస్తూ.. అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న వారిని డ్రోన్ కెమెరాలతో పోలీసులు గుర్తించారు. వారిపై చర్యలకు ఉప్రక్రిమించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 28 , 2024 | 08:56 PM