వందేళ్ల మెదక్ చర్చ్.. విశేషాలివే..
ABN, Publish Date - Dec 22 , 2024 | 09:41 PM
జిల్లాలోని కేథడ్రల్ చర్చి అనేది ఓ అద్భుతం. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చిగా దీనికి పేరుంది. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఠీవిగా కనిపించే ఈ చర్చిని భారతీయ, విదేశీ నిపుణులు నిర్మించారు.
మెదక్: జిల్లాలోని కేథడ్రల్ చర్చి అనేది ఓ అద్భుతం. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చిగా దీనికి పేరుంది. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఠీవిగా కనిపించే ఈ చర్చిని భారతీయ, విదేశీ నిపుణులు నిర్మించారు. రెండస్తుల్లో నిర్మించిన ఈ కట్టడ శిఖరం వందేళ్లయినా చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు ఆనాడు భారతీయ పురాతన పద్ధతులను అనుసరించారు. రంగురంగుల గాజు ముక్కలతో చర్చి లోపలి భాగంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఏసుక్రీస్తు పుట్టుక, శిలువ వేయడం, ఆరోహణం ఇవన్నీ ఈ పెయింటింగ్స్‌లో కనిపిస్తాయి. విశేషం ఏంటంటే ఇవన్నీ ఒకే గాజుపై వేసినవి కాదు, ఇంగ్లాండ్‍లో గాజు ముక్కలపై విడివిడిగా పెయింటింగ్స్ వేసి మెదక్ తీసుకొచ్చి అమర్చారు.
Updated Date - Dec 22 , 2024 | 09:43 PM