అమరావతిపై మళ్లీ కుట్రలు..
ABN, Publish Date - Dec 22 , 2024 | 12:34 PM
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ కలిసి రూ. 15 వేల కోట్ల రుణం ఇస్తుండడంతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తాజాగా ఈ నెల 18న ప్రంపంచ బ్యాంకు ఇన్‌స్పెక్షన్ ప్యానెల్‌కు ఓ ఫిర్యాదు అందింది.
అమరావతి: ఏపీ రాజధాని అమరావతిపై దుష్టశక్తుల కుట్రలు మళ్లీ మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం రాజధాని పనులను శరవేగంగా ముందుకు తీసుకువెళుతుండడంతో దుష్టశక్తులు కలుగులోనుంచి బయటకు వచ్చాయి. అమరావతికి మద్దతు తెలుపుతున్న పార్టీలకు.. ఎన్నికల్లో ప్రజలు ఘనవిజయం అందించినా.. ఆ దుష్ట శక్తులకు బుద్ది రాలేదు. ప్రపంచ బ్యాంక్ రుణం రాకుండా అడ్డుకునేందుకు మళ్లీ ఫిర్యాదుల పర్వానికి తెర తీశాయి.
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ కలిసి రూ. 15 వేల కోట్ల రుణం ఇస్తుండడంతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తాజాగా ఈ నెల 18న ప్రంపంచ బ్యాంకు ఇన్‌స్పెక్షన్ ప్యానెల్‌కు ఓ ఫిర్యాదు అందింది. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ చేయడం చట్ట విరుద్ధమని రైతులను బెదిరించి, భయపెట్టి సంతకాలు చేయించుకున్నారని ఆ ఫిర్యాదులో అసత్య ఆరోపణలు చేశారు. దానివల్ల అక్కడ ప్రజలు జీవనోపాధి కోల్పోయారని, ఆహార భద్రదకు విఘాతం కలుగుతోందని, పర్యావరణ, సామాజిక, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని ఫిర్యాదులో తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
చెప్పులు కుట్టే వ్యక్తిని సన్మానించిన పవన్
ప్రమాదం ఆయన ప్రేరేపించింది కాదు: పురందేశ్వరి
కుప్పంలో నాల్గవ రోజు నారా భువనేశ్వరి పర్యటన
కాలినడకన ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీలు...
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 22 , 2024 | 12:34 PM