సీపీఎం నేత సీతారాం ఏచూరి కన్నుమూత
ABN, Publish Date - Sep 12 , 2024 | 04:56 PM
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం సాయంత్రం న్యూఢిల్లీలో మృతి చెందారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10వ తేదీన న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో కుటుంబ సభ్యులు ఆయన్ని చేర్చారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం సాయంత్రం న్యూఢిల్లీలో మృతి చెందారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10వ తేదీన న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో కుటుంబ సభ్యులు ఆయన్ని చేర్చారు. ఐసీయూలో చికిత్స పొందుతూ గురువారం ఆయన తుది శ్వాస విడిచారు.
1952, ఆగస్ట్ 12వ తేదీన చెన్నైలో సీతారాం ఏచూరి జన్మించారు. 1974లో ఆయన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్‌ఐ)లో చేరారు. జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా సీతారాం ఏచూరి మూడు సార్లు ఎన్నికయ్యారు. అనంతరం ఆల్ ఇండియా ఎస్‌ఎఫ్ఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.
1984లో సీపీఐ(ఎం) సెంట్రల్ కమిటీకి సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు. అనంతరం శాశ్వత ఆహ్వానితుడిగా ఆయనను పార్టీ ఎంపిక చేసింది. ఆ తర్వాత పాలిట్‌బ్యూరో సభ్యుడిగా పార్టీ నియమించింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆయన సభ్యుడిగా కొనసాగారు. 2005లో సీతారాం ఏచూరి పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2018, 2022లో సీపీఎం (ఎం) ప్రధాన కార్యదర్శిగా రెండు సార్లు ఎన్నికయ్యారు.
Updated Date - Sep 12 , 2024 | 04:57 PM