ఏపీ మహిళలకు సర్కార్ గుడ్‌న్యూస్..
ABN, Publish Date - Dec 31 , 2024 | 12:06 PM
అమరావతి: మహిళలకు ఇచ్చిన హామీలో ఉచిత గ్యాస్ సిలెండర్ పథకాన్ని ఇప్పటికే అమలు చేశామని.. ఉచిత బస్సు కూడా అమలు చేయాలని.. సంక్రాంతి నుంచి అమలు చేద్దామని సీఎం చంద్రబాబు అన్నారు.
అమరావతి: మహిళలకు ఇచ్చిన హామీలో ఉచిత గ్యాస్ సిలెండర్ పథకాన్ని ఇప్పటికే అమలు చేశామని.. ఉచిత బస్సు కూడా అమలు చేయాలని.. సంక్రాంతి నుంచి అమలు చేద్దామని సీఎం చంద్రబాబు అన్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలంటే 3,500 బస్సులు, 11వేల సిబ్బంది అవసరమని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కనీసం 2 వేలు కొత్త బస్సులు.. లేదా అద్దె బస్సులు లేకుండా మహిళలకు ఉచిత ప్రయాణ హామీ అమలు చేయలేమని అన్నారు.
ఏపీఎస్ ఆర్టీసీలో ప్రయాణీకుల ఆక్యుపెన్సీ రేషియో సరాసరి 69 శాతం వరకు ఉంటుందని, మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే 94 శాతానికి పెరుగుతుందని అంచనా వేసినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఉచిత ప్రయాణం అమలుతో ప్రభుత్వంపై ప్రతి నెల రూ. 265 కోట్ల భారం పడే అవకాశం ఉందన్నారు. కర్నాటక, తెలంగాణ, తమిళనాడుతో పాటు పంజాబ్, ఢిల్లీలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆర్టీసీ అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు
రేషన్ బియ్యం మాయం కేసులో అరెస్టులు..
పీఎస్‌ఎల్‌వి-సి 60 విజయవంతంపై సీఎం చంద్రబాబు హర్షం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 31 , 2024 | 12:08 PM