కాళేశ్వరం పేరుతో కూలేశ్వరం కట్టారు: మంత్రి కోమటిరెడ్డి..
ABN, Publish Date - Dec 21 , 2024 | 03:37 PM
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ వంటిదని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కానీ, బీఆర్ఎస్ పార్టీ పదేళ్లపాటు మ్యానిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని మంత్రి మండిపడ్డారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ వంటిదని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కానీ, బీఆర్ఎస్ పార్టీ పదేళ్లపాటు మ్యానిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని మంత్రి మండిపడ్డారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో బీఆర్ఎస్‌పై మంత్రి కోమటిరెడ్డి సెటైర్లు వేశారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, వ్యవసాయ బోర్లు, మోటార్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వంటి అనేక హామీలు ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ పార్టీ కూడా ఇన్ని అబద్ధాలు ఆడలేదని మంత్రి ధ్వజమెత్తారు. దళిత ముఖ్యమంత్రిని చేయకపోతే తన(కేసీఆర్) మెడ మీద తల ఉండదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారని, కానీ చివరికి ఏం చేశారంటూ మంత్రి ప్రశ్నించారు. అలాగే కాళేశ్వరం పేరుతో కూలేశ్వరం కట్టారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేయగా సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నవ్వులు పూయించారు.
Updated Date - Dec 21 , 2024 | 03:37 PM