లంచం ఇవ్వనిదే అక్కడ పనులు జరగవు..!

ABN, Publish Date - Aug 13 , 2024 | 08:13 AM

వరంగల్: తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్. దినదినాభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అదే స్థాయిలో జరుగుతోంది. పట్టణీకరణ పెరుగుతుండడంతో కొత్తగా ఇళ్లు నిర్మించుకునేవారి సంఖ్య కూడా అధికమవుతోంది. దీంతో నిర్మాణ అనుమతులకోసం నిత్యం వందల సంఖ్యలో ధరఖాస్తులు చేసుకుంటున్నారు.

వరంగల్: తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్. దినదినాభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అదే స్థాయిలో జరుగుతోంది. పట్టణీకరణ పెరుగుతుండడంతో కొత్తగా ఇళ్లు నిర్మించుకునేవారి సంఖ్య కూడా అధికమవుతోంది. దీంతో నిర్మాణ అనుమతులకోసం నిత్యం వందల సంఖ్యలో ధరఖాస్తులు చేసుకుంటున్నారు. దీన్ని నగరపాలక అధికారులు క్యాష్ చేసుకుంటున్నారు. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం అన్ని డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకున్నవారు నగర ప్రణాళికా విభాగం అధికారులకు అమ్యామ్యాలు ముట్టజెప్పనిదే పనులు కావడంలేదనే ఫిర్యాదులు ఉన్నాయి. పైసలు ఇస్తే పర్మిషన్ ఇట్టే ఇచ్చేస్తారు. లేకపోతే అన్నీ డాక్యుమెంట్లు ఉన్నా.. కొర్రీలు వేసి.. జాప్యం చేసి.. దరఖాస్తు దారులను ముప్పతిప్పలు పెట్టి.. మూడు చెరువుల నీరు తాగించి.. తమ దారిలోకి తెచ్చుకుంటారు. దీంతో నెలల తరబడి కార్యాలయం చుట్టు తిరగడం ఎందుకనే ఉద్దేశంతో లంచం ఇవ్వాల్సి వస్తోంది. పైసలు ఇవ్వకపోతే పనికాదని ఇక్కడ ఉద్యోగులే నేరుగా చెబుతుంటారు. లంఛం ఎలా చెల్లించాలో మార్గాలు చూపుతారు.

Updated at - Aug 13 , 2024 | 08:17 AM