ఆస్పత్రి పాలైన రెజ్లర్ వినేశ్ ఫోగట్..|
ABN, Publish Date - Aug 07 , 2024 | 02:15 PM
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్ తగిలింది. మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో వినేశ్ పొగట్‌పై అనర్హత వేటు పడింది. నిర్ణీత బరువు కంటే 100 గ్రాముల అధికంగా ఉన్నారంటూ ఒలింపిక్స్ నిర్వహకులు పేర్కొన్నారు. ఆ క్రమంలో ఆమెపై అనర్హత వేటు వేశారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్ తగిలింది. మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో వినేశ్ పొగట్‌పై అనర్హత వేటు పడింది. నిర్ణీత బరువు కంటే 100 గ్రాముల అధికంగా ఉన్నారంటూ ఒలింపిక్స్ నిర్వహకులు పేర్కొన్నారు. ఆ క్రమంలో ఆమెపై అనర్హత వేటు వేశారు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయినట్లు సమాచారం. దాంతో ఆమె ఆసుప్రతి పాలయ్యారని తెలుస్తుంది.
వినేశ్‌పై అనర్హత వేటు పడడంపై ప్రధాని మోదీ ఇప్పటికే స్పందించారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రధాని మోదీ సాంత్వన కలిగించేలా ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు గత రాత్రి అమె అధికంగా వ్యాయమం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇంకవైపు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంపై నిరసన తెలియజేయాలని ప్రధాని మోదీకి రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉషా సూచించారు.
Updated Date - Aug 07 , 2024 | 02:15 PM