ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kothagudem: కాలం చెల్లిన టవర్ల కూల్చివేత.. అరుదైన ఘట్టం ఆవిష్కృతం

ABN, Publish Date - Aug 05 , 2024 | 05:07 PM

దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లో కాలం చెల్లిన 8 కూలింగ్ టవర్లను సోమవారం కూల్చివేశారు.

భద్రాద్రి కొత్తగూడెం: దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లో కాలం చెల్లిన 8 కూలింగ్ టవర్లను సోమవారం కూల్చివేశారు. 102 మీటర్ల ఎత్తులో ఉన్న కూలింగ్ టవర్లను ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా కూల్చేశారు. రాజస్థాన్‌కు చెందిన ఓ కంపెనీ, నిపుణుల పర్యవేక్షణలోనే కూల్చివేతలు చేపట్టారు. ఈ టవర్లలో నాలుగు టవర్లు1966-67 మధ్య నిర్మించగా, మిగతా నాలుగింటినీ1974-78 మధ్య కట్టారు. కరెంట్ ఉత్పత్తి కోసం జపాన్ సాంకేతికతను ఉపయోగించి వీటిని తయారు చేశారు. వీటిని ఎప్పుడో కూల్చివేయాలనుకున్నప్పటికీ.. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆలస్యం అయ్యాయి. 2023 ఫిబ్రవరిలో పాత కేటీపీఎస్‌ ప్లాంట్‌లోని 100,120 మీటర్ల ఎత్తైన టవర్లను కూల్చివేసిన సంగతి తెలిసిందే.

Updated Date - Aug 05 , 2024 | 05:07 PM

Advertising
Advertising