Farmers: రైతుల జీవితాల్లో కొత్త వెలుగు.. ఎందుకంటే..?
ABN, Publish Date - Dec 07 , 2024 | 01:10 PM
కొత్త ఆలోచనలతో.. వినూత్న పద్ధతులను అవలంభిస్తూ పంట సాగు చేస్తే రైతుల ఇంట సిరుల పంట పండుతుంది. వరి, మొక్కజొన్న ఇతర వాణిజ్య పంటలు కాకుండా పూల సాగుపై దృష్టిసారిస్తే మేలు జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో కొందరు రైతులు బంతిపూల సాగు చేసి అధిక లాభాలను ఆర్జించారు.
వివేకంతో ఆలోచించి, కాస్త తెలివిగా సాగు చేయాలే కానీ.. రైతుల ఇంట సిరుల పంట పడుతుంది. లాభాలు ఇచ్చే పంటపై ఫోకస్ చేస్తున్నారు. పూల సాగుపై రైతులు దృష్టిసారించారు. అందులో బంతిపూలకు మంచి గిరాకీ ఉంటుంది. తక్కువ సమయంలో, తక్కువ పెట్టుబడితో బంతి పూల పంట లాభాలను ఆర్జిస్తోంది. ఇదే విషయం చెప్పి రైతులు సంబర పడుతున్నారు. ఖర్చుల పోను ఎకరానికి రూ.2 లక్షలు ఆదాయం మిగులుతుందని వివరించారు.
Updated Date - Dec 07 , 2024 | 01:10 PM