Supreme Court: లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోదియాకు బెయిల్
ABN, Publish Date - Aug 09 , 2024 | 09:02 PM
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం మంజూరు చేసింది.
ఢిల్లీ: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం మంజూరు చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో 17 నెలల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ప్రతి సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాలని సిసోడియాను సుప్రీం ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా సుప్రీం విచారించింది. విచారణ పూర్తైన అనంతరం కొద్ది రోజుల క్రితం తీర్పును రిజర్వ్ చేసి శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ క్రమంలోనే 17 నెలల తర్వాత మనీష్ సిసోడియా బయటకు వచ్చారు.
Updated Date - Aug 11 , 2024 | 02:56 PM