‘అల్లు అర్జున్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా..’
ABN, Publish Date - Dec 05 , 2024 | 05:05 PM
తెలంగాణకు సంబంధం లేని హీరోలు, నిర్మాతల కోసం తెలంగాణ పౌరులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కదా
హైదరాబాద్: పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై తెలంగాణ అడ్వొకేట్ శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తొక్కిసలాటలో చోటుచేసుకున్న మరణం కాదని తెలంగాణ ప్రభుత్వం చేసిన హత్య అని ఆయన మండిపడ్డారు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని థియేటర్ యాజమాన్యంపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విడుదల నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని యాజమాన్యాలు కనీసం అదనపు సిబ్బంది కానీ సెక్యూరిటీ గార్డులను గాని నియమించలేదన్నారు. వారితో ఓవర్ టైం డ్యూటీలు చేయిస్తూ డబ్బులు దండుకున్నారన్నారు. తెలంగాణకు సంబంధం లేని హీరోలు, నిర్మాతల కోసం తెలంగాణ పౌరులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కదా అలాంటి వారి కోసం ప్రభుత్వం ఇంత అత్యుత్సాహం చూపడమేంటన్నారు.
Updated Date - Dec 05 , 2024 | 05:08 PM