ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

11 రోజులు.. 294 స్టాళ్లు

ABN, Publish Date - Jan 02 , 2025 | 01:14 AM

ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 35వ విజయవాడ పుస్తక మహోత్సవం గురువారం నుంచి ప్రారంభం కానుంది. 12వ తేదీ వరకు పుస్తకాల ప్రదర్శనలు జరుగనున్నాయి. ప్రచురణకర్తల కోసం విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ 294 స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఇంగ్లీషు ప్రచురణకర్తలు ఈసారి అధిక సంఖ్యలో రాబోతున్నారు. పుస్తక ఆవిష్కరణల కోసం ఒక వేదికను, బాలల ప్రతిభను కనబరిచే కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు మరో వేదికను సిద్ధం చేశారు.

నేడు విజయవాడ పుస్తక మహోత్సవం ప్రారంభం

ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వేదికగా ఏర్పాటు

ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌

విజయవాడ కల్చరల్‌, జనవరి 1(ఆంధ్రజ్యోతి): ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 35వ విజయవాడ పుస్తక మహోత్సవం గురువారం నుంచి ప్రారంభం కానుంది. 12వ తేదీ వరకు పుస్తకాల ప్రదర్శనలు జరుగనున్నాయి. ప్రచురణకర్తల కోసం విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ 294 స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఇంగ్లీషు ప్రచురణకర్తలు ఈసారి అధిక సంఖ్యలో రాబోతున్నారు. పుస్తక ఆవిష్కరణల కోసం ఒక వేదికను, బాలల ప్రతిభను కనబరిచే కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు మరో వేదికను సిద్ధం చేశారు. ప్రధాన వేదికకు చెరుకూరి రామోజీరావు వేదిక అని నామకరణం చేయగా, బాలల ప్రతిభ వేదికకు రతన్‌ టాటా పేరును పెట్టారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో డిప్యూటీ సీఏం పవన్‌కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ప్రముఖ కవులు, రచయితల జయంతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీనితో పాటు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలు జరగనున్నాయి.

Updated Date - Jan 02 , 2025 | 01:15 AM