Rajahmundry Airport: రాజమండ్రి నుంచి ముంబై వెళ్లే విమానం తాత్కాలికంగా రద్దు..!
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:24 AM
రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు గతంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు మాత్రమే విమాన సర్వీసులు ఉండేవి. అయితే ఆ తర్వాత రాజమండ్రి నుంచి ఇతర నగరాలకు కూడా కనెక్టివిటీ పెరిగింది. రాజమండ్రి విమానాశ్రయం నుంచి కొత్తగా ఢిల్లీ, ముంబై నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి.

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు (Rajahmundry Airport) గతంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు మాత్రమే విమాన సర్వీసులు ఉండేవి. అయితే ఆ తర్వాత రాజమండ్రి నుంచి ఇతర నగరాలకు కూడా కనెక్టివిటీ పెరిగింది. రాజమండ్రి విమానాశ్రయం నుంచి కొత్తగా ఢిల్లీ, ముంబై నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఇండిగో సంస్థ రాజమండ్రి నుంచి ఢిల్లీ, ముంబై నగరాలకు ఎయిర్‌బస్‌లను ప్రవేశపెట్టింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ముంబై టు రాజమండ్రి, రాజమండ్రి టు ముంబై ఎయిర్ బస్ సర్వీసు ప్రారంభమైంది (Rajahmundry to Mumbai AirBus).
రాజమండ్రి టు ముంబై ఎయిర్ బస్ సర్వీసుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ రోజు (ఫిబ్రవరి 15) నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి ముంబై వెళ్లే ఎయిర్ బస్సును తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ మేరకు ప్రయాణికులకు ఎయిర్ పోర్టు అధికారులు ముందస్తు సమాచారం తెలియజేశారు. మళ్లీ మార్చి 1వ తేది నుంచి యధావిధిగా రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి ముంబైకి ఎయిర్ బస్సు సర్వీసు పునురుద్దరణ జరుగుతుందని తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..