Drinking water తాటిమాను గుంతలో తాగునీటి ఎద్దడి

ABN, Publish Date - Mar 29 , 2025 | 12:35 AM

మండలంలోని తాటిమాను గుంతలో నెలరోజుల నుంచి తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ఆ గ్రామస్థులు వాపోతున్నారు.

 Drinking water తాటిమాను గుంతలో తాగునీటి ఎద్దడి
ట్యాంక్‌ వద్ద నీరు పట్టుకుంటున్న గ్రామస్థులు

నంబులపూలకుంట, మార్చి 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని తాటిమాను గుంతలో నెలరోజుల నుంచి తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ఆ గ్రామస్థులు వాపోతున్నారు. బోరులో నీరు పుష్కలంగా ఉన్నా.. కొళాయిల ద్వారా నీటిని సరఫరా చేయడం లేదన్నారు. దీంతో గ్రామస్ధులు అందరూ ట్యాంక్‌ వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకుందన్నారు. నీటిని తెచ్చుకోవడానికే సమయం సరిపోతోందని, పనులకు వెళ్లలేకపోతున్నామని వాపోయారు. గ్రామంతా మూగజీవాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వాటి దాహార్తిని తీర్చడానికి ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. సమస్యను అధికారులు, నాయకులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అఽధికారులు, నాయకులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:35 AM