dmho బత్తలపల్లి పీహెచసీలో క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ సెంటర్‌

ABN, Publish Date - Mar 29 , 2025 | 12:31 AM

బత్తలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ సెంటర్‌ను డీఎంహెచఓ ఫిరోజాబేగం శుక్రవారం ప్రారంభించారు.

dmho బత్తలపల్లి పీహెచసీలో క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ సెంటర్‌
దర్శినమల పీహెచసీలో మాట్లాడుతున్న డీఎంహెచఓ

బత్తలపల్లి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): బత్తలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ సెంటర్‌ను డీఎంహెచఓ ఫిరోజాబేగం శుక్రవారం ప్రారంభించారు. డీఎంహెచఓ మాట్లాడుతూ.. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఆర్డీటీ వారితో కలసి ఈ పీహెచసీలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచఓ సెల్విరాజ్‌, ఆర్డీటీ గైనకాలజిస్ట్‌ జ్యోతిర్మయి, రమ్య, శిల్ప, శ్రీనివా్‌సరెడ్డి, నాగేంద్రనాయక్‌, జనార్దననాయుడు పాల్గొన్నారు.

ధర్మవరంరూరల్‌ : మండలంలోని దర్శినమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రావులచెరువులోని విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ను జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి ఎస్‌ ఫిరోజాబేగం శుక్రవారం తనిఖీ చేశారు. ఆమె వెంట డీఐఓ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ డీఎంహెచఓ నాగేంద్రనాయక్‌, వైద్యాధికారి డాక్టర్‌ దిలీ్‌పకుమార్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:31 AM