ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MILLET: అవసరాలకు అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు

ABN, Publish Date - Mar 25 , 2025 | 12:12 AM

వాతావరణ పరిస్థితులతో పాటు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు చేయాల్సి ఉందని విశ్రాంత వైస్‌ చాన్సలర్‌, సీఆర్‌ఐడీఏ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు.

Changes in agriculture according to needs

అనంతపురం క్లాక్‌టవర్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): వాతావరణ పరిస్థితులతో పాటు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు చేయాల్సి ఉందని విశ్రాంత వైస్‌ చాన్సలర్‌, సీఆర్‌ఐడీఏ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. గత మూడు రోజులుగా స్వచ్ఛంద సంస్థలు, రైతు ఉత్తత్తిదారుల సంఘాలతో కలిసి అనంత సుస్థిర వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా పోలీస్‌ కన్వెన్షన సెంటర్‌లో నిర్వహిస్తున్న చిరుధాన్యాల మేళా సోమవారం ముగిసింది. ముఖ్య అతిథులుగా హాజరైన విశ్రాంత వైస్‌ చాన్సలర్‌ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు చేస్తూ, ప్రజల ఆరోగ్యాలను కాపాడాలన్నారు. ముగింపు సందర్భంగా నిర్వాహకులకు ప్రశంసాపత్రాలు, మెమెంటోలతో సత్కరించారు. ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ మల్లారెడ్డి, వనం ప్రసాద్‌,వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, నాబార్డు డీడీఎం అనురాధ పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:12 AM