Child marriage is a crime బాల్యవివాహాలు నేరం
ABN, Publish Date - Jan 03 , 2025 | 12:44 AM
బాల్యవివాహాలు చట్టరీత్యానేరమని మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ తెలిపారు. పట్టణంలోని నందలపాడులో ఉన్న మోడల్‌స్కూల్‌లో గురువారం కిశోరి వికాసం- బాల్యవివాహ రహిత ఆంధ్రప్రదేశ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తాడిపత్రి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): బాల్యవివాహాలు చట్టరీత్యానేరమని మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ తెలిపారు. పట్టణంలోని నందలపాడులో ఉన్న మోడల్‌స్కూల్‌లో గురువారం కిశోరి వికాసం- బాల్యవివాహ రహిత ఆంధ్రప్రదేశ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కమిషనర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు బాలికలను బాగా చదివించాలన్నారు. అలాకాకుండా బాల్యవివాహాలు చేస్తే వారి అభివృద్ధికి ఆటంకం ఏర్పడి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయని తెలిపారు. బాల్యవివాహాలను నిర్మూలించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. రాష్ర్టాన్ని బాల్యవివాహ రహిత ఆంధ్రప్రదేశగా మార్చేందుకు అందరూ కృషిచేయాలని కోరారు. అనంతరం డీఎస్పీ రామకృష్ణుడు, ఐసీడీఎస్ సీడీపీఓ సాజిదాబేగం, డాక్టర్ సుమనతో కలిసి బాల్యవివాహాల నిర్మూలనకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jan 03 , 2025 | 12:44 AM